Telugu News CoronaVirus Free ration scheme to labour and migrants can be extended for three months ramvilas paswan
రేషన్‌కార్డుదారులు కేంద్రం గుడ్‌న్యూస్ ! మరో 3 నెలలు…
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద రేషన్ కార్డు కలిగిన వారికి గత మూడు నెలలుగా ఉచితంగా రేషన్ అందిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన వారికి ఊరట కలిగించే నిర్ణయం..
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద రేషన్ కార్డు కలిగిన వారికి గత మూడు నెలలుగా ఉచితంగా రేషన్ అందిస్తోంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ కింద కేంద్రం 81 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ ప్రయోజనాన్ని అందజేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన వారికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్‌ను మరో మూడు నెలలు పొడిగించే యోచనలో ఉన్నట్లు కేంద్రమంత్రి రామ్‌విలాస్ పాశ్వన్ తెలిపారు. ఉచిత రేషన్ అందించే స్కీమ్‌ను మరో మూడు నెలలు పొడిగించాలని పది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన వెల్లడించారు. అస్సాం, పంజాబ్, కర్నాటక, తమిళనాడు, కేరళ, రాజస్తాన్ వంటి పలు రాష్ట్రాలు ఈ మేరకు లేఖ రాశాయని వివరించారు. రాష్ట్రాల అభ్యర్థనలను పీఎంవో ఆఫీస్‌కు పంపించామని, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తుందని రామ్ విలాస్ పాశ్వన్ స్పష్టం చేశారు.