‘కోవిడ్-19 తొలి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇమేజీ ఇదిగో’ ! సార్స్-కరోనా మధ్య వైరస్ లింక్

| Edited By: Pardhasaradhi Peri

Mar 28, 2020 | 1:58 PM

2002 లో సార్స్ వైరస్ కారణంగా యూరప్ దేశాల్లో 700 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వేలాది మంది అస్వస్థులయ్యారు. తాజాగా కరోనా వైరస్ కి, సార్స్ వైరస్ కి మధ్య లింక్ ఉన్న ఆనవాళ్లు కనబడ్డాయి. ఇందుకు నిదర్శనంగానా అన్నట్టు పూణేలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఎన్ ఐ వీ రీసెర్చర్లు… కోవిడ్-19 మొట్టమొదటి వైరస్ ఇమేజీని విడుదల చేశారు. ఓ ట్రాన్స్ మిషన్ ఎలెక్ట్రాన్ మైక్రోస్కోప్ ని వినియోగించి ఈ ఇమేజీని […]

కోవిడ్-19 తొలి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇమేజీ ఇదిగో ! సార్స్-కరోనా మధ్య వైరస్ లింక్
Follow us on

2002 లో సార్స్ వైరస్ కారణంగా యూరప్ దేశాల్లో 700 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వేలాది మంది అస్వస్థులయ్యారు. తాజాగా కరోనా వైరస్ కి, సార్స్ వైరస్ కి మధ్య లింక్ ఉన్న ఆనవాళ్లు కనబడ్డాయి. ఇందుకు నిదర్శనంగానా అన్నట్టు పూణేలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఎన్ ఐ వీ రీసెర్చర్లు… కోవిడ్-19 మొట్టమొదటి వైరస్ ఇమేజీని విడుదల చేశారు. ఓ ట్రాన్స్ మిషన్ ఎలెక్ట్రాన్ మైక్రోస్కోప్ ని వినియోగించి ఈ ఇమేజీని క్యాప్చర్ చేశారు వాళ్ళు. ‘సార్స్-కోవ్-2’ ఇమేజీగా వారు దీన్ని వ్యవహరిస్తున్నారు.

గత జనవరి 30 న ఓ మహిళ గొంతు భాగంలో ఈ వైరస్ ఆనవాళ్లు కనబడ్డాయని తొలిసారిగా ల్యాబ్ టెస్ట్ కన్ఫామ్ చేసింది. చైనాలోని వూహాన్ లో మరో ముగ్గురు విద్యార్థులతో బాటు మెడిసిన్ చదువుతున్న ఈమె అక్కడి నుంచి కేరళ తిరిగి వచ్చింది. ఆమె సాంపిల్స్ ని పూణే లోని వైరాలజీ ఇన్స్ టి ట్యూట్ కి పంపగా.. అవి వూహాన్ లో అప్పటికే ప్రబలంగా ఉన్న వైరస్ తో దాదాపు 100 శాతం మ్యాచ్ అయిందని శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఇండియాలో కనుగొన్న ఇది తొలి సార్స్-కోవ్-2 వైరస్ అంటూ ఈ రీసెర్చర్ల బృందం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్  జర్నల్ లో తమ అధ్యయన విశేషాలను ప్రచురించారు. అసలిది కరోనాకు కారణమయ్యే వైరస్ అని దాదాపు నిర్ధారించారు. సార్స్ కన్నా ఈ కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుందని, అందువల్లే ప్రపంచ దేశాలు దీనితో తీవ్రంగా సతమతమవుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు.