FIR On Tiger Shroff: లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే సెల‌బ్రిటీల‌నూ వ‌ద‌లం.. బాలీవుడ్ హీరో, హీరోయిన్‌పై కేసు న‌మోదు..

FIR On Tiger Shroff: దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ఎంత‌టి విప‌త్తును సృష్టిస్తోందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రోజుకు ఏకంగా మూడున్న‌ర ల‌క్ష‌ల కేసులు న‌మోదైన రోజులు చూశాం. అయితే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి రావ‌డంతో...

FIR On Tiger Shroff: లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే సెల‌బ్రిటీల‌నూ వ‌ద‌లం.. బాలీవుడ్ హీరో, హీరోయిన్‌పై కేసు న‌మోదు..
Fir On Tiger Shroff

Updated on: Jun 03, 2021 | 7:02 AM

FIR On Tiger Shroff: దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ఎంత‌టి విప‌త్తును సృష్టిస్తోందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రోజుకు ఏకంగా మూడున్న‌ర ల‌క్ష‌ల కేసులు న‌మోదైన రోజులు చూశాం. అయితే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి రావ‌డంతో కాస్త కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌డుతోంది. లాక్‌డౌన్‌ను క‌ఠినంగా పాటించ‌డం ద్వారానే కేసుల సంఖ్య అదుపులోకి వ‌స్తాయ‌న్ని భార‌త్‌లో వెంట‌నే లాక్‌డౌన్ అమలు చేయాలని ప్ర‌పంచ దేశాల‌కు చెందిన నిపుణులు సూచించ‌న నేప‌థ్యంలో.. ఒక్కొక్క‌టిగా దేశంలో అన్నిరాష్ట్రాలు లాక్‌డౌన్‌ను అమ‌లు చేశాయి.
ఇదిలా ఉంటే క‌రోనాను అంత‌మొందించేందుకు ఉన్న ఏకైక అస్త్ర‌మైన లాక్‌డౌన్ ఉల్లంఘ‌ల‌ను కొందరు య‌ధేశ్చ‌గా ఉల్లంఘిస్తున్నారు. స‌మాజంలో న‌లుగురికి ఆద‌ర్శంగా నిల‌వాల్సిన వారు సైతం ఉల్లంఘ‌ల‌ను అతిక్ర‌మిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు.. టైగ‌ర్ ష్ర‌ఫ్‌, దిశా ప‌ఠానితో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ముంబ‌యిలోని బ్యాండ్‌స్టాండ్ ప్రొమెనేడ్ ప్రాంతంలో టైగ‌ర్ ష్ర‌ఫ్‌, దిశా మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల స‌మ‌యంలో తిరుగుతూ క‌నిపించారు. పోలీసులు ఎందుకు బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని ప్ర‌శ్నించ‌గా.. స‌రైన స‌మాధానం చెప్ప‌లేదు. దీంతో స‌ద‌రు సెల‌బ్రిటీల‌పై ఎఫ్ఐఆర్ కేసు న‌మోదు చేశారు.

Also Read: H1B Visa Scam: అమెరికాలో వెలుగులోకి మ‌రో ఘ‌రానా మోసం.. హైద‌రాబాద్ కేంద్రంగా హెచ్‌1బీఈ వీసా స్కామ్‌..

కరోనా కష్టకాలంలో కాస్ట్లీ ఇళ్లు కొనుగోలు చేస్తున్న బాలీవుడ్ స్టార్స్.. అమితాబ్ పాటు ఆ హీరో కూడా…

Vijay Devarakonda: చరిత్ర సృష్టించిన క్రేజీ హీరో.. వరుసగా మూడోసారి మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా విజయ్ దేవరకొండ

Loading...
Unable to load recommendations.
Follow Us