COVID-19 Travel Rules : కరోనా గీత దాటితే 10వేల పౌండ్ల వరకు జరిమానా, జైలు.. రెడ్​లిస్ట్​ను విడుదల చేసిన బ్రిటన్ వైద్య, ఆరోగ్య శాఖ

|

Feb 10, 2021 | 3:06 PM

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 'రెడ్​ లిస్ట్​'లోని దేశాల నుంచి బ్రిటన్​లో అడుగుపెట్టే ప్రయాణికులకు నిబంధనలను బ్రిటన్ కఠినతరం చేసింది . ఈ క్వారంటైన్​..

COVID-19 Travel Rules : కరోనా గీత దాటితే 10వేల పౌండ్ల వరకు జరిమానా, జైలు.. రెడ్​లిస్ట్​ను విడుదల చేసిన బ్రిటన్ వైద్య, ఆరోగ్య శాఖ
COVID-19 Travel Rules
Follow us on

COVID-19 Travel Rules : కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ‘రెడ్​ లిస్ట్​’లోని దేశాల నుంచి బ్రిటన్​లో అడుగుపెట్టే ప్రయాణికులకు నిబంధనలను బ్రిటన్ కఠినతరం చేసింది . ఈ క్వారంటైన్​ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 10వేల పౌండ్ల వరకు జరిమానా ఉంటుందని బ్రిటన్ ప్రకటించింది.

అంతేకాదు పదేళ్ల జైలు శిక్ష విధించనున్నట్లు హెచ్చరించింది. ఈ నిబంధనలు వచ్చే సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని బ్రిటన్ వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి మాట్​ హాన్​కాక్​ వెల్లడించారు . కరోనా వ్యాప్తిని అరికట్టే దిశగా.. తమ దేశంలోకి వచ్చే ప్రయాణికులకు నూతన క్వారంటైన్ నిబంధనలను నిర్దేశించింది బ్రిటన్​ ప్రభుత్వం.

బ్రిటన్​కు వచ్చిన ప్రయాణికులు ప్రభుత్వం సూచించిన హోటల్లో 10రోజులు క్వారంటైన్​లో ఉండాలని తన ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత హోటల్​ను 1750 పౌండ్స్​తో ముందుగానే బుక్​ చేసుకోవచ్చన్నారు. రెడ్​లిస్ట్​లో 33 దేశాలు ఉన్నాయి. వీటిల్లోని ఎక్కువ ప్రాంతాలు దక్షిణాఫ్రికా, యూఏఈ, దక్షిణ అమెరికాలోనే ఉన్నాయి. భారత్​ రెడ్​ లిస్ట్​లో లేదు.