మళ్లీ ఎబోలా కలకలం.. నలుగురు మృతి

2018లో ప్రబలిన ఎబోలా వైరస్ ఆఫ్రికాలో మళ్లీ విజృంభిస్తోంది. కాంగోకు పశ్చిమాన ఉన్న బందక అనే నగరంలో ఎబోలో కేసులు బయటపడినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆరు కేసులను గుర్తించినట్లు తెలిపారు. కాగా ఇప్పటికే ఈ ఎబోలాతో నలుగురు...

మళ్లీ ఎబోలా కలకలం.. నలుగురు మృతి

Edited By:

Updated on: Jun 02, 2020 | 11:28 AM

ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ మరో మహమ్మారి కోరలు చాస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు దాదాపు 64 లక్షలకి పైగా చేరింది. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇప్పటికే కరోనాతో ప్రజలు ఆందోళన చెందుతుంటే.. ఇప్పుడు ఎబోలా కలకలంతో మరింత భయబ్రాంతులకు గురి అవుతున్నారు.

2018లో ప్రబలిన ఎబోలా వైరస్ ఆఫ్రికాలో మళ్లీ విజృంభిస్తోంది. కాంగోకు పశ్చిమాన ఉన్న బందక అనే నగరంలో ఎబోలో కేసులు బయటపడినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆరు కేసులను గుర్తించినట్లు తెలిపారు. కాగా ఇప్పటికే ఈ ఎబోలాతో నలుగురు మరణించినట్లు వైద్యులు పేర్కొంటున్నారు.

Read More:

ప్రపంచంపై కరోనా పంజా.. పెరుగుతున్న మరణాలు

కరోనా కలవరం.. నటి ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం