87వ ఏట రాజ్యసభకు “దేవెగౌడ”

|

Jun 12, 2020 | 9:26 PM

మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ రాజ్యసభకు ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, బీజేపీ అభ్యర్థులు అశోక్ గస్తి, ఇరానా కడడి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు పోటీ లేకుండానే ఎన్నికల ప్రక్రియ ముగిసింది. పార్టీల సంఖ్యాబలాలకు తగినట్లుగానే అభ్యర్థులను పోటీకి దింపడంతో ఏకగ్రీవం ప్రశాంతంగా జరిగింది. “ఎన్నిక” ప్రక్రియ ఇలా జరిగింది… కర్ణాటక అసెంబ్లీలో స్పీకర్ తో […]

87వ ఏట రాజ్యసభకు దేవెగౌడ
Follow us on

మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ రాజ్యసభకు ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, బీజేపీ అభ్యర్థులు అశోక్ గస్తి, ఇరానా కడడి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు పోటీ లేకుండానే ఎన్నికల ప్రక్రియ ముగిసింది. పార్టీల సంఖ్యాబలాలకు తగినట్లుగానే అభ్యర్థులను పోటీకి దింపడంతో ఏకగ్రీవం ప్రశాంతంగా జరిగింది.

“ఎన్నిక” ప్రక్రియ ఇలా జరిగింది…

కర్ణాటక అసెంబ్లీలో స్పీకర్ తో కలిపి బీజేపీకి 117 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు 68, జేడీఎస్ కు 34 మంది ఉన్నారు. ఒక రాజ్యసభ సీటును గెలవాలంటే 45 మంది సభ్యుల సంఖ్యాబలం అవసరం. ఇంత బలం జేడీఎస్‌కు లేనప్పటికీ… కాంగ్రెస్ పార్టీ మద్దతుతో దేవెగౌడ ను రాజ్యసభకు పంపించగలిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక సభ్యుడిని గెలుచుకుని… మిగిలిన సభ్యుల ఓట్లతో దేవెగౌడకు మద్దతుగా నిలిచింది.