దేశ రాజధానిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే రికవరీ రేటు కూడా ఎక్కువగా ఉండటంతో.. అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు అక్కడి ప్రజలు. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1,276 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,51,928కి చేరింది. వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 1,36,251 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా 11,489 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
కాగా, శనివారం నాడు ఢిల్లీ వ్యాప్తంగా 18 వేల వరకు కరోనా పరీక్షలు నిర్వహించారు. 5,667 ఆర్టీపీసీఆర్ విధానం ద్వారా నిర్వహించగా.. 12,604 రాపిడ్ యాంటిజెన్ విధానం ద్వారా కరోనా టెస్టులు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా 12.91 లక్షల కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఢిల్లీ సర్కార్ ప్రకటించింది.
5667 RTPCR/CBNAAT/TrueNat tests and 12604
Rapid antigen tests conducted today. So far, 1291411 tests have been conducted: Health Department, Delhi https://t.co/v451ksYNlH— ANI (@ANI) August 15, 2020
Read More :
16 వేల అడుగుల ఎత్తులో రెపరెపలాడిన జాతీయ జెండా