‘నిసర్గ’ తుపాను.. అప్రమత్తమైన మహారాష్ట్ర, గుజరాత్

| Edited By: Pardhasaradhi Peri

Jun 02, 2020 | 7:34 PM

అరేబియా సముద్రంలో తీవ్ర వాయుగుండమై తుపానుగా మారిన ‘నిసర్గ’.. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల వైపు దూసుకువస్తోంది. రానున్న 12 గంటల్లో భారీ వర్షాలు..గంటకు 110 నుంచి 120 కి.మీ. వేగంతో కూడిన పెనుగాలులతో ఇది పెను తుపానుగా మారవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది. హోం మంత్రి అమిత్ షా అప్పుడే ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి.. ఆ ప్రభుత్వాలు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల గురించి తెలుసుకున్నారు. బుధవారం నాటికి ముఖ్యంగా ఈ తుపాను ముంబై, […]

నిసర్గ తుపాను.. అప్రమత్తమైన మహారాష్ట్ర, గుజరాత్
Follow us on

అరేబియా సముద్రంలో తీవ్ర వాయుగుండమై తుపానుగా మారిన ‘నిసర్గ’.. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల వైపు దూసుకువస్తోంది. రానున్న 12 గంటల్లో భారీ వర్షాలు..గంటకు 110 నుంచి 120 కి.మీ. వేగంతో కూడిన పెనుగాలులతో ఇది పెను తుపానుగా మారవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది. హోం మంత్రి అమిత్ షా అప్పుడే ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి.. ఆ ప్రభుత్వాలు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల గురించి తెలుసుకున్నారు. బుధవారం నాటికి ముఖ్యంగా ఈ తుపాను ముంబై, సిటీ శివార్లు, థానే, పాల్గర్, రాయ్ గడ్, రత్నగిరి, సింధ్ దుర్గ్ జిల్లాలను తాకవచ్చునని  వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే తమ రాష్ట్ర ప్రజల నుద్దేశించి ప్రసంగించనున్నారు. కాగా- గుజరాత్, మహారాష్ట్రలలో 33 ఎన్ ఢీ ఆర్ ఎఫ్ బృందాలను రెడీగా ఉంచారు. మంగళవారం సాయంత్రానికి నిసర్గ తుపాను ముంబైకి సుమారు 670 కి.మీ. దూరంలో ఉంది. కరోనా వైరస్ రోగులను మహారాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాల నుంచి సుదూర కోవిడ్ కేంద్రాలకు తరలించింది.