పాసులు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు- సీపీ అంజనీ

ఈ పాసులను ఎవరైనా దుర్వినియోగం చేస్తే కఠినమైన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్

పాసులు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు- సీపీ అంజనీ

Updated on: Apr 20, 2020 | 3:56 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఏదైనా అత్యవసర సమయాల్లో ప్రయాణాలు చేసే వారి కోసం తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు అనుమతులు ఇస్తూ పాసులు మంజూరు చేస్తున్నారు. అయితే ఈ పాసులను ఎవరైనా దుర్వినియోగం చేస్తే కఠినమైన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ హెచ్చరించారు. పాసులు దుర్వినియోగం చేస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు కూడా పెడతామన్నారు. తొలుత రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొదలైన ఈ పాసుల మంజూరు ప్రస్తుతం రాష్ట్రమంతటా అనుమతిస్తున్నారు పోలీసులు.
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి ప్రతాపం కొనసాగుతూనే ఉంది. ఆదివారం ఒక్కరోజే తెలంగాణలో 18 కొత్త కరోనా కేసులు నమోదైనట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటి వరకూ కరోనా సోకడం వల్ల 21 మంది చనిపోయినట్లు తెలిపారు. చాప‌కింద నీరులా వైర‌స్ విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో కేంద్రం ప్ర‌క‌టించిన లాక్‌డౌన్‌ను సైతం తెలంగాణ‌లో మే 7వ‌ర‌కు పొడిగిస్తూ..ముఖ్య‌మంత్రి ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి విధిత‌మే.