ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, రష్యా, భారత్ వంటి దేశాలు కరోనా నివారణకు వ్యాక్సిన్ తయారీకి కృషి చేస్తున్నాయి. అయితే కరోనాపై ఫైట్ చేస్తున్న ప్రపంచ దేశాలు వారి వారి ప్రయత్నాల్లో ఎక్కడి వరకు చేరుకున్నారో చూద్దామా…
రష్యా ప్రభుత్వం తన తయారు చేసిన వ్యాక్సిన్‌కు స్పుత్నిక్ వీ అని పేరు పెట్టింది. ప్రస్తుతం వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. ఈ వ్యాక్సిన్ భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. అయితే స్పుత్నిక్ వి టీకా నిర్వాహణ, పంపిణీ కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది.
బ్రిటన్ ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌కు ఆస్ట్రాజెనెకా అని పేరు పెట్టింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఈ వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. భారత దేశంలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆక్స్‌ఫర్డ్ బృందంతో ఒప్పందకుని దేశీయంగా పుణేలో వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. ప్రస్తుతం ఈ టీకా సైతం ట్రయల్స్ దశలో ఉంది.
చైనా దేశం కరోనా నియంత్రణకు సినోఫార్మ్ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ప్రస్తుతం ఈ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసుకుంది. చైనా వ్యాక్సిన్ 86 శాతం సమర్థవంతంగా పనిచేస్తోందతీ యుఏఈ వైద్యశాఖ తెలిపింది.
అగ్రరాజ్యం అమెరికా కరోనాపై పోరుకు మోడెర్నా టీకాను రూపొందిస్తోంది. ప్రస్తుతం ఈ టీకా ట్రయల్స్ మూడో దశలో ఉన్నాయి. ఈ టీకాను మైనస్ 20 డిగ్రీల నిల్వ ఉంచాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
జర్మనీ, అమెరికా కలిసి సంయుక్తంగా ఫైజర్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ మూడో దశలో ఉన్నాయి. అయితే అల్ట్రా కోల్డ్ స్టోరేజ్ పద్ధతిలో మైనస్ 75 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ధ నిల్వ చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కాగా బయో ఫార్మా బయో ఎన్టెక్ కంపెనీ ఫైజర్ తయారీ కోసం ఒప్పందం చేసుకుంది.
భారత దేశానికి చెందిన భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ టీకాను తయారు చేస్తోంది. ఐసీఎంఆర్‌తో కలిసి టీకాను రూపొందించడంలో భారత్ బయోటెక్ తో కలిసి పని చేస్తోంది. ఈ టీకాను హైదరాబాద్‌లో అభివృద్ధి చేస్తున్నారు. కాగా, క్లినికల్ ట్రయల్స్ మూడో దశలో ఉన్నాయి.
భారత దేశానికి చెందిన క్యాడిలా హెల్త్ కేర్ సంస్థ జైకోవ్ డి టీకా ను అహ్మదాబాద్ కేంద్రంగా తయారు చేస్తోంది. ప్రస్తుతం ఈ టీకా ట్రయల్స్ మూడో దశలో ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్న సంస్థల సంఖ్య 34
ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ రూపొందించి ప్రీ క్లినికల్ ట్రయల్స్ వరకు చేరుకున్న కంపెనీలు 142
ప్రపంచ వ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ 3 దశలో ఉన్నాయి.