India Vaccination: వేగవంతంగా కోవిడ్ వ్యాక్సినేషన్.. మరో మైలురాయి అధిగమించిన భారత్

|

Jun 19, 2021 | 9:10 AM

India Covid-19 vaccination: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండొచ్చన్న నిపుణుల సూచనలతో.

India Vaccination: వేగవంతంగా కోవిడ్ వ్యాక్సినేషన్.. మరో మైలురాయి అధిగమించిన భారత్
Covid 19 Vaccination Drive
Follow us on

India Covid-19 vaccination: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండొచ్చన్న నిపుణుల సూచనలతో.. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తోంది. వ్యాక్సిన్ల కొరత లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత్ కోవిడ్‌-19 టీకా డ్రైవ్‌లో మరో మైలురాయిని అధిగమించింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 27 కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశంలో శుక్రవారం నాటికి వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ 154వ రోజుకు చేరింది. శుక్రవారం రాత్రి 7 గంటల వరకు దేశంలో మొత్తం 27,20,72,645 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

మూడో విడుత టీకా డ్రైవ్‌లో భాగంగా 18-44 ఏళ్ల సమూహానికి 19,43,765 మందికి మొదటి డోసు ఇచ్చినట్లు వెల్లడించింది. మరో 77,989 మందికి రెండో డోసు టీకా అందజేసినట్లు పేర్కొంది. మూడో దశ డ్రైవ్‌ ప్రారంభించిన నాటి నుంచి మొత్తం 5,15,68,603 డోసుల వ్యాక్సిన్లను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. శుక్రవారం ఒకే రోజు 29,84,172 వ్యాక్సిన్ డోసులు వేయగా.. ఇందులో 26,24,028 మంది లబ్ధిదారులకు మొదటి డోసు ఇచ్చారు. మరో 3,60,144 మంది లబ్ధిదారులకు రెండో డోసు అందజేసినట్లు కేంద్రం వెల్లడించింది.

Also Read:

Covid Third Wave: థర్డ్ వేవ్ ఎప్పుడు రాబోతుంది? తాజా సర్వేలో సంచలన విషయాలు

Milka Singh : ‘భాగ్ మిల్కా భాగ్’ కోసం మిల్కా సింగ్ ఒప్పుకోలేదట..! చివరికి ఆ వ్యక్తి ఒత్తిడి వల్ల ఓకే అన్నాడట..