వీధి వ్యాపారుల‌కు ఊర‌ట‌.. ఉద‌యం 10 నుంచి రాత్రి 8 వ‌ర‌కు ప‌ర్మిష‌న్..

లాక్ డౌన్ కార‌ణంగా ఆదాయం కోల్పోయి ఇబ్బందులు ప‌డుతున్న వీధి వ్యాపారుల‌కు ఢిలీ స‌ర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు కార్య‌క‌లాపాలు..

వీధి వ్యాపారుల‌కు ఊర‌ట‌.. ఉద‌యం 10 నుంచి రాత్రి 8 వ‌ర‌కు ప‌ర్మిష‌న్..
Follow us

| Edited By:

Updated on: Jul 28, 2020 | 12:43 PM

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ కేసుల విషయంలో ప్ర‌పంచంలోనే మూడో స్థానానికి చేరింది భార‌త్‌. ఇప్ప‌టికే కేంద్రం ఎన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న కూడా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక భార‌త్‌ రాజ‌ధాని ఢిల్లీలో కూడా ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ఉంది. ఒక్కో రోజు కేసులు త‌గ్గుతున్నా‌.. మ‌రో రోజు మాత్రం పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుపోతున్నాయి. దీంతో ఢిల్లీ ప్ర‌భుత్వం క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉన్న కంటైన్‌మెంట్ జోన్ల‌లో లాక్‌డౌన్ విధించింది. అయితే లాక్డౌన్ కార‌ణంగా ఆదాయం కోల్పోయి ఇబ్బందులు ప‌డుతున్న వీధి వ్యాపారుల‌కు ఢిలీ స‌ర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు కార్య‌క‌లాపాలు నిర్వ‌హించేందుకు ప‌ర్మిష‌న్ ఇచ్చింది

క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో మాస్క్ ధ‌రిస్తూ, భౌతిక దూరం, పరిశుభ్ర‌త వంటి నిబంధ‌న‌లు పాటిస్తూ.. నాన్ కంటైన్‌మెంట్ జోన్ల‌లో వ్యాపారం చేసుకోవ‌చ్చ‌ని పేర్కొంది. అయితే వారాంత‌పు మార్కెట్ల నిర్వ‌హ‌ణ‌పై మాత్రం నిషేధం సాగుతుంద‌ని సీఎం కేజ్రీవాల్ స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య్ దేవ్ సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. కాగా ప్ర‌స్తుతం ఢిల్లీలో 1,31,219 కోవిడ్ పాజిటివ్ కేసులు న‌మోద‌వ్వ‌గా.. 3,853 మంది చ‌నిపోయారు. అలాగే 10,994 యాక్టీవ్ కేసులుండ‌గా, 1,16,371 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Read More:

న‌ల్గొండ‌లో ఆగ‌ష్టు 14 వ‌ర‌కు లాక్ డౌన్..

రామ్ గోపాల్ వ‌ర్మ‌కు షాక్.. రూ.4 వేల‌ ఫైన్ విధించిన జీహెచ్ఎంసీ..

Latest Articles