న‌ల్గొండ‌లో ఆగ‌ష్టు 14 వ‌ర‌కు లాక్ డౌన్..

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా.. ప‌లు జిల్లాలో లాక్ డౌన్ విధిస్తున్నారు అధికారులు. తాజాగా న‌ల్గొండ జిల్లాలో ఈ నెల 30వ తేదీ నుంచి ఆగ‌ష్టు 14వ తేదీ వ‌ర‌కూ లాక్ డౌన్ విధిస్తున్న‌ట్లు ఎమ్మెల్యే కంచ‌ర్ల భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. సోమ‌వారం క్యాంప్ ఆఫీసులో వ్యాపారుల‌తో స‌మావేశ‌మైన ఎమ్మెల్యే..

న‌ల్గొండ‌లో ఆగ‌ష్టు 14 వ‌ర‌కు లాక్ డౌన్..
lockdown
Follow us

| Edited By:

Updated on: Jul 28, 2020 | 12:26 PM

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా.. ప‌లు జిల్లాలో లాక్ డౌన్ విధిస్తున్నారు అధికారులు. తాజాగా న‌ల్గొండ జిల్లాలో ఈ నెల 30వ తేదీ నుంచి ఆగ‌ష్టు 14వ తేదీ వ‌ర‌కూ లాక్ డౌన్ విధిస్తున్న‌ట్లు ఎమ్మెల్యే కంచ‌ర్ల భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. సోమ‌వారం క్యాంప్ ఆఫీసులో వ్యాపారుల‌తో స‌మావేశ‌మైన ఎమ్మెల్యే.. లాక్‌డౌన్ విష‌య‌మై కూడా చ‌ర్చించారు. ఈ నేప‌థ్యంలో కేవ‌లం అత్య‌వ‌స‌ర షాపులు మాత్ర‌మే తెరుచుకునేందుకు ప‌ర్మిష‌న్ ఇచ్చారు. అలాగే కూర‌గాయ‌లు, మొబైల్ షాపుల‌కు మాత్రమే మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు అనుమ‌తి ఉంటుంద‌న్నారు.

ఇక మిర్యాల గూడ‌లో కేసులు విప‌రీతంగా పెరుగుతూండ‌‌టంతో.. జులై 28, 29 తేదీల్లో కిరాణా షాపులు మూసేయాల‌ని నిర్ణ‌యించారు. అయితే న‌ల్గొండ‌లో మాత్రం 30 వ తేదీ నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కూ షాపులు తెరుచుకుని ఉంటాయి. కాగా సోమ‌వారం న‌ల్గొండ జిల్లాలో 26 మంది క‌రోనా బారిన ప‌డగా.. సూర్యాపేట జిల్లాలో 35 మంది, భువ‌న‌గిరి జిల్లాలో 12 మంది కోవిడ్ బారిన ప‌డ్డారు.

ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 1610 కొత్త కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 57,142కి చేరింది. మృతుల సంఖ్య 480కి పెరిగింది. కరోనా నుంచి తాజాగా 803 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 42,909కి చేరింది. ప్రస్తుతం 13,753 మంది చికిత్స పొందుతున్నారు.

Read More: రామ్ గోపాల్ వ‌ర్మ‌కు షాక్.. రూ.4 వేల‌ ఫైన్ విధించిన జీహెచ్ఎంసీ..