క‌రోనా @ 4200 .. ఒక్క‌రోజే 552 కేసులు

దేశ‌వ్యాప్తంగా ఆదివారం ఒక్క‌రోజే 1500లు దాటి క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17వేలు దాటింది. ముఖ్యంగా క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని

క‌రోనా @ 4200 .. ఒక్క‌రోజే 552 కేసులు

Updated on: Apr 20, 2020 | 6:53 AM

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తోంది. కోర‌లు చాస్తూ బుస‌లు కొడుతున్న కోవిడ్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టినా అది ప్ర‌తాపం చూపెడుతోంది. దేశ‌వ్యాప్తంగా ఆదివారం ఒక్క‌రోజే 1500లు దాటి క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో  క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17వేలు దాటింది. ముఖ్యంగా క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని మ‌హారాష్ట్ర విల‌విల‌లాడుతోంది.
ప్ర‌మాద‌క‌ర క‌రోనా వైర‌స్ కార‌ణంగా మ‌హారాష్ట్ర అల్లాడుతోంది. ఆదివారం ఒక్క‌రోజే రాష్ట్రంలో పెద్ద సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 552 వైర‌స్ పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయ‌ని అధికారులు తెలిపారు.  దీంతో మ‌హారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 4200 చేరింది. కోవిడ్ బారిన ప‌డి ఇప్ప‌టి వ‌ర‌కు 223 మంది మ‌ర‌ణించారు. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,470గా ఉంది. ఆదివారం 142 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 507కు చేరింది. మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా రాజధాని ముంబైలో వైర‌స్ ప్ర‌భావం అధికంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు రెండు వేల‌కుపైగా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.