‘ఈ వైరస్ ఇంకా ప్రమాదకరమే’…’అప్రమత్తత అవసరం’…ప్రధాని మోదీ

దేశంలో కరోనా వైరస్ తొలిదశలోనే ఉందని, కానీ ఇంకా ప్రమాదకరమేనని ప్రధాని మోదీ అన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతయినా అవసరమని ఆయన కోరారు. ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి తన 'మన్ కీ బాత్' కార్యక్రమం..

ఈ వైరస్ ఇంకా ప్రమాదకరమే...అప్రమత్తత అవసరం...ప్రధాని మోదీ

Edited By:

Updated on: Jul 26, 2020 | 12:19 PM

దేశంలో కరోనా వైరస్ తొలిదశలోనే ఉందని, కానీ ఇంకా ప్రమాదకరమేనని ప్రధాని మోదీ అన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతయినా అవసరమని ఆయన కోరారు. ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా ప్రసంగిస్తూ.. ప్రస్తుతం ఇండియాలో కరోనా వైరస్ పరిస్థితి ఇతర దేశాలకన్నా మెరుగ్గా ఉందని ఆయన చెప్పారు. లక్షల మంది ప్రాణాలను రక్షించగలిగామని, అయితే దీని ముప్పు ఇంకా తొలగిపోలేదని అన్నారు. టెస్టిగుల సంఖ్య పెరిగిందని, దీంతో మరణాల సంఖ్య కూడా చాలావరకు తగ్గిందని మోదీ పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు .కార్గిల్ అమర వీరులకు ఆయన నివాళి అర్పించారు.

కాగా-దేశంలో కరోనా వైరస్ కేసులు 13,85,522 కి చేరాయి. మృతుల సంఖ్య 32,063 కి పెరిగింది. గత 24 గంటల్లో 705 మరణాలు సంభవించాయి. 8,85,577 మంది రోగులు కోలుకోగా.. రీకవరీ రేటు 63.91 శాతం ఉంది.