Flash News: మే 3 వరకు ఐపీఎల్ వాయిదా.. సౌరవ్ గంగూలీ ప్రకటన..

|

Apr 15, 2020 | 2:42 PM

వచ్చే నెల మధ్య వారం వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిర్వహణ కుదరదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. దేశవ్యాప్త లాక్ డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని.. మే 3 తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్ణయం బట్టి ఐపీఎల్ టోర్నీ నిర్వహణపై ఫైనల్ డెసిషన్ తీసుకుంటామని సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. కాగా, మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఈ లీగ్.. కరోనా […]

Flash News: మే 3 వరకు ఐపీఎల్ వాయిదా.. సౌరవ్ గంగూలీ ప్రకటన..
Follow us on

వచ్చే నెల మధ్య వారం వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిర్వహణ కుదరదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. దేశవ్యాప్త లాక్ డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని.. మే 3 తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్ణయం బట్టి ఐపీఎల్ టోర్నీ నిర్వహణపై ఫైనల్ డెసిషన్ తీసుకుంటామని సౌరవ్ గంగూలీ వెల్లడించాడు.

కాగా, మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఈ లీగ్.. కరోనా ప్రభావం కారణంగా ఏప్రిల్ 15కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు లాక్ డౌన్‌ను పొడిగించింది. మరోవైపు ఐపీఎల్ కోసం సెప్టెంబర్- నవంబర్ విండోను పరిశీలించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో టీ20 వరల్డ్ కప్ జరగాల్సి ఉండగా.. అది కాస్తా మరింత ముందుకు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బీసీసీఐ అధ్యక్షుడి పదవీకాలం పొడిగింపుకు సంబంధించి రాజ్యాంగాన్ని సవరించాల్సిందిగా కోరుతూ గంగూలీ బృందం కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.

ఇవి చదవండి:

లాక్ డౌన్ అమలులో విజయవంతం.. ఏపీ అగ్రస్థానం.!

ఏపీ: రెడ్‌జోన్‌లో 41.. ఆరెంజ్‌ జోన్‌లో 45.. గ్రీన్ జోన్‌లో 590… షరతులు వర్తిస్తాయి.

మందుబాబులకు ‘లిక్కర్ దానం’.. వీడియో వైరల్.. హైదరాబాద్ యువకుడి అరెస్ట్..