కరోనా ఎఫెక్ట్: విజయ్‌ ఇంట్లో ఆరోగ్య శాఖ అధికారుల తనిఖీలు..!

కరోనా వ్యాప్తికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించింది.

కరోనా ఎఫెక్ట్: విజయ్‌ ఇంట్లో ఆరోగ్య శాఖ అధికారుల తనిఖీలు..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 30, 2020 | 4:00 PM

కరోనా వ్యాప్తికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించింది. అంతేకాదు నిబంధనలు ఉల్లంచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. మరోవైపు ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చిన వారి వివరాలను సేకరించిన ఆరోగ్యశాఖ అధికారులు.. వారి ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా స్టార్ హీరో విజయ్‌ ఇంట్లో తనిఖీలు చేశారు.

చెన్నైలో విజయ్ నివాసం ఉంటోన్న నీలంకరి నివాసానికి వెళ్లిన అధికారులు.. విజయ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత వారి ఇంట్లో కుటుంబ సభ్యులెవరు ఈ మహమ్మారి బారిన పడలేదని వారు నిర్ధారించారు. కాగా ఇటీవలే విజయ్‌ విదేశాలకు వెళ్లి రాగా.. ఆయన మినహా మిగిలిన కుటుంబ సభ్యులెవరు ఆరు నెలలుగా విదేశాలకు వెళ్లలేదని ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంట్లో శానిటైజర్‌ స్ప్రే చేసి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

Read This Story Also: ప్రపంచమంతా అల్లకల్లోలం.. అయినా మారని చైనా తీరు.. మళ్లీ మొదలెట్టేశారు..!