ప్రపంచమంతా అల్లకల్లోలం.. అయినా మారని చైనా తీరు.. మళ్లీ మొదలెట్టేశారు..!

వారు చేసిన చేష్టలకు ఇప్పుడు ప్రపంచం మొత్తం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది. వారి దేశం నుంచి వచ్చిన ఓ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఎన్నో ప్రపంచ దేశాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. పోనీ ఆ దేశమైనా ఆ వైరస్ నుంచి  పూర్తిగా కోలుకుందా..? అంటే అదీ లేదు. ఇంకా 82వేల మందికి పైగా ఆ రాక్షసితో యుద్ధం చేస్తున్నారు. అయినా ఆ దేశం తీరు మారలేదు. ఆంక్షలు ఇలా తొలిగాయో లేదో.. అలా మళ్లీ తమ పైత్యాన్ని చూపిస్తున్నారు. […]

ప్రపంచమంతా అల్లకల్లోలం.. అయినా మారని చైనా తీరు.. మళ్లీ మొదలెట్టేశారు..!
Follow us

| Edited By:

Updated on: Mar 29, 2020 | 9:14 PM

వారు చేసిన చేష్టలకు ఇప్పుడు ప్రపంచం మొత్తం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది. వారి దేశం నుంచి వచ్చిన ఓ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఎన్నో ప్రపంచ దేశాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. పోనీ ఆ దేశమైనా ఆ వైరస్ నుంచి  పూర్తిగా కోలుకుందా..? అంటే అదీ లేదు. ఇంకా 82వేల మందికి పైగా ఆ రాక్షసితో యుద్ధం చేస్తున్నారు. అయినా ఆ దేశం తీరు మారలేదు. ఆంక్షలు ఇలా తొలిగాయో లేదో.. అలా మళ్లీ తమ పైత్యాన్ని చూపిస్తున్నారు. కరోనా వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న డ్రాగన్ కంట్రీ ప్రజలు.. అంత ప్రాణ నష్టం జరిగినా ఏం మారలేదు. ఇష్టానుసార ఆహార శైలితో ప్రపంచాన్ని ఇవాళ ఇబ్బంది పెడుతున్న వారు.. మళ్లీ అదే వైపు అడుగులు వేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న చైనా.. నెలల తరువాత లాక్‌డౌన్‌కు ఇటీవలే స్వప్తి పలికింది. ముందులాగే ప్రజలు ప్రశాంత జీవనం గడపొచ్చని అక్కడి ప్రభుత్వం ప్రజలకు చెప్పేసింది. దీంతో చైనా ప్రజలు సంబరాలు జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. గత కొన్ని నెలలుగా చప్పబడిన నాలుకను టేస్ట్ చేసుకోవాలనుకున్నారు. తాజాగా సౌత్‌ వెస్ట్‌ చైనాలోని గుయ్‌లిన్‌లో కుక్కలు, పిల్లులు, తేళ్లు, గబ్బిలాలు, పాములు ఇతర రకాల క్రిమి కీటకాలు, జంతువుల మాంసం షాపుల వద్ద పెద్ద సంఖ్యలో అక్కడి ప్రజలు క్యూలు కట్టారు. దానికి తోడు పలు రకాల జీవుల మాంసంతో తయారు చేసిన చైనా ఆయుర్వేద షాపులు సైతం రోడ్లమీద దర్శనమిచ్చాయి. వీటికి సంబంధించిన ఫొటోలు కొన్ని సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇక ఈ ఫొటోలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు మారరా ఇక.. వీళ్లు చచ్చినా బాగుపడరు. చైనా నుంచి ఇంతకంటే ఎక్కువ ఏం ఎదురుచూస్తాం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read This Story Also: కరోనాను జయించిన ప్రధాని భార్య..!

భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??