ఏటీఎం నుంచి డబ్బులను తీస్తున్నారా? కరోనా సోకకుండా ఇలా చేయండి!

| Edited By:

Apr 27, 2020 | 10:20 AM

కరోనా వైరస్ అంటు వ్యాధి కావడం వల్ల ఎప్పుడు? ఎవరికి సంక్రమిస్తుందో చెప్పడం కష్టం. అయితే దీనికి ప్రస్తుతం మందు కూడా లేకపోవడంతో వ్యక్తిగత జాగ్రత్తలతోనే కరోనాను అరికట్టగటం. అందులోనూ ఏటీఎంలో నగదు విత్‌ డ్రా చేయడం..

ఏటీఎం నుంచి డబ్బులను తీస్తున్నారా? కరోనా సోకకుండా ఇలా చేయండి!
Follow us on

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు ఇప్పటికే పలు ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. అయితే అనుకోకుండానే మనం నిత్యం చేసే పనుల వల్ల కూడా కరోనా సోకే ప్రమాదముంది. ఇప్పటికే సోషల్ డిస్టెన్స్, ఫేస్ మాస్క్‌లు ధరించడం, శానిటైజర్స్ వాడటం వంటింవి చేస్తూనే ఉన్నాం. ఇది అంటు వ్యాధి కావడం వల్ల ఎప్పుడు? ఎవరికి సంక్రమిస్తుందో చెప్పడం కష్టం. అయితే దీనికి ప్రస్తుతం మందు కూడా లేకపోవడంతో వ్యక్తిగత జాగ్రత్తలతోనే కరోనాను అరికట్టగలం. అందులోనూ ఏటీఎంలో నగదు విత్‌ డ్రా చేయడం ముఖ్యమైనది. ఎందుకంటే చాలా మంది ఏటీఎంల నుంచి డబ్బును తీస్తారు కాబట్టి.. కరోనా సోకకుండా ఏటీఎంలో నగదు ఎలా విత్ డ్రా చేసుకోవాలో.. టీవీ9 మీకోసం ప్రత్యేకంగా కొన్ని సలహాలు ఇస్తోంది.

-ఏటీఎం తలుపు తీసేటప్పుడు చేతులతో కాకుండా భుజం లేదా కాలుతో తెరవడం మంచిది
-ఏటీఎంలో లోపల ఏ వస్తువునూ నేరుగా తాకకూడదు
-ఇక పిన్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు టిష్యూ పేపర్ వాడటం బెటర్
-ఏటీఎం నుంచి వచ్చిన నగదును నేరుగా జేబుల్లో పెట్టుకోకూడదు. శానిటైజ్ చేసిన తర్వాతే జేబులో పెట్టుకోవాలి
-అలాగే ఏటీఎం కార్డు ఉపయోగించే ముందు, ఆ తర్వాత కూడా శానిటైజ్ చేయాలి
-ఏటీఎంలో పని ముగిసిన తర్వాత చేతులను శానిటైజ్ శుభ్రపరుచుకోవడం మరిచిపోవద్దు

Read More: 

లైవ్‌లో ‘ఐలవ్‌యూ చెప్పి ముద్దు’ అడిగిన నెటిజన్.. ఇంటికొచ్చి మరీ తంతానంటోన్న హేమ

మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగింపుకే మొగ్గుచూపుతోన్న సీఎం కేసీఆర్

అన్నీ తెలిసే వెళ్లాడు.. తనకి నేనేం సలహాలు ఇస్తాను? పవన్‌పై చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్