Breaking: ఏపీలో హోమ్ క్వారంటైన్‌లో 10 మంది ఆర్టీసీ డ్రైవర్లు

| Edited By: Pardhasaradhi Peri

May 11, 2020 | 10:17 PM

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2వేలు దాటేసింది. కాగా తాజాగా ఏపీలో 10 మంది డ్రైవర్లను హోమ్ క్వారంటైన్‌లో ఉంచారు.

Breaking: ఏపీలో హోమ్ క్వారంటైన్‌లో 10 మంది ఆర్టీసీ డ్రైవర్లు
Follow us on

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2వేలు దాటేసింది. కాగా తాజాగా ఏపీలో 10 మంది డ్రైవర్లను హోమ్ క్వారంటైన్‌లో ఉంచారు. అమలాపురంకు చెందిన ఆరుగురు ఆర్టీసీ డ్రైవర్లు, రాజమండ్రికి చెందిన నలుగురు ఆర్టీసీ డ్రైవర్లను హోమ్ క్వారెంటైన్‌కు తరలించారు అధికారులు. కాగా శనివారం 100 మంది ఒఎన్జీసీ ఉద్యోగులను రావులపాలెం నుంచి ఇంద్ర బస్సుల్లో అధికారులు చెన్నై తీసుకెళ్లారు. అందులో ఇద్దరు ఒఎన్జీసీ ఉద్యోగులకు కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు 10 మంది ఆర్టీసీ డ్రైవర్లను హోమ్ క్వారంటైన్‌లో ఉంచింది. కాగా ఏపీలో మొత్తం 2018 కరోనా కేసులు నమోదు కాగా.. 998 మంది కోలుకున్నారు. ప్రస్తుతం అక్కడ  975  యాక్టివ్ కేసులు ఉండగా.. 45 మంది ఈ మహమ్మారితో మరణించారు.

Read This Story Also: తమిళనాట ఆగని కరోనా విజృంభణ.. 8వేలు దాటేసిన కేసులు..!