కరోనా అలా సోకే అవకాశాలు తక్కువేనట..!

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు చాలా దేశాలు లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తున్నాయి.

కరోనా అలా సోకే అవకాశాలు తక్కువేనట..!
Follow us

| Edited By:

Updated on: Jun 08, 2020 | 4:40 PM

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు చాలా దేశాలు లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తున్నాయి. మరోవైపు మాస్క్‌లు ధరిస్తూ, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ వైరస్‌తో కలిసి జీవించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి గురించిన కీలక అంశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్‌ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. మనిషి నుంచి మనిషికి మాత్రమే వైరస్‌ సులభంగా వ్యాపిస్తుందని పేర్కొంది. అయితే ఉపరితలాల ద్వారా, అలాగే జంతువుల నుంచి కూడా మనిషికి వైరస్‌కి సోకే అవకాశం తక్కువేనని తెలిపింది.

వైరస్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు అతడి నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా వైరస్ వ్యాప్తి త్వరగా చెందుతుంది. అది కూడా సదరు వ్యక్తి ఆరు అడుగుల దూరంలో ఉంటే మాత్రమే వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు సీడీసీ వెల్లడించింది. ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి కరోనా చేరాలంటే ఆ వైరస్‌కి దాదాపు వెయ్యి కణాలు అవసరం అవుతాయి. ఇక ఎక్కువ మంది గుమిగూడే అవకాశం ఉన్న నర్సింగ్ హోంలు, జైళ్లు, క్రూయిజ్ షిప్పులు, మాంసం ప్యాకింగ్ ప్లాంట్లు తదితర ప్రదేశాల్లో వైరస్ ఈజీగా వ్యాప్తి చెందుతుందని వెల్లడించింది. ఇక కరోనా ఉన్న వ్యక్తికి 45 నిమిషాల కంటే తక్కువ సమయం ఉంటే మనకు కరోనా సోకే అవకాశాలు తక్కువే. అయితే మాస్క్‌ ధరించినప్పటికీ.. ఆ వ్యక్తి ముఖంలో ముఖం పెట్టి 4 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడితే వైరస్ సోకే అవకాశాలు ఎక్కువేనని సీడీసీ తెలిపింది.

ఇక కరోనా సోకిన వ్యక్తి పక్క నుంచి నడుచుకుంటూ లేదా సైక్లింగ్ చేసుకుంటూ వెళితే వైరస్‌ అంటుకునే ప్రమాదం తక్కువే. వెలుతురు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో నిర్ణీత సమయం పాటు వైరస్‌ సోకే అవకాశం ఉండదు. ఆఫీసులు, పాఠశాలల్లో భౌతిక దూరం పాటించినప్పటికీ వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అని సీడీసీ వెల్లడించింది.

Read This Story Also: కరోనా అప్‌డేట్స్: ఏపీలో భారీగా నమోదైన కేసులు..!