రాములోరికి తప్పని కరోనా కష్టాలు…భక్తులు లేకుండానే…!

|

Mar 17, 2020 | 1:43 PM

దేశవ్యాప్తంగా అన్ని స్కూల్స్‌, థియేటర్స్‌ మూతపడగా దేవాలయాలపై కూడా ఈ ప్రభావం పడింది. ఏప్రిల్ 2న భద్రాద్రిలో జరగనున్న శ్రీరామ నవమి వేడుకలను వెంటాడుతోంది కరోనా. ..

రాములోరికి తప్పని కరోనా కష్టాలు...భక్తులు లేకుండానే...!
Follow us on

కొవిడ్-19…భూతం చైనాలో విలయ తాండవం చేసిన మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. కరోనా వైరస్ ధాటికి మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. భారత్‌లోనూ వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని స్కూల్స్‌, థియేటర్స్‌ మూతపడగా దేవాలయాలపై కూడా ఈ ప్రభావం పడింది. ఏప్రిల్ 2న భద్రాద్రిలో జరగనున్న శ్రీరామ నవమి వేడుకలను వెంటాడుతోంది కరోనా. రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా అలర్ట్ నేపథ్యంలో భక్తులు లేకుండానే శ్రీరామనవమి జరుపుతామని మంత్రి పువ్వాడ అజయ్‌ పేర్కొన్నారు. ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి పువ్వాడ ఈ మేరకు స్పష్టం చేశారు. శ్రీ రాములవారి కల్యాణం టికెట్లు రద్దు చేస్తున్నామని ప్రకటించారు.. టికెట్‌ డబ్బు తిరిగి ఆలయ అధికారులు చెల్లిస్తారన్నారు. కరోనాపై ప్రజలు భయభ్రాంతులకు గురికావొదని, మరింత అప్రమత్తంగా ఉండాలని ఉండాలని సూచించారు.

ఇది కూడా చదవండి:యువ ఫుట్‌బాల్ కోచ్‌ని మింగేసిన కరోనా