Coronavirus: ఆ ప్రాంతాల్లో కరోనా వైరస్ ముప్పు ఎక్కువట.. సంచలన విషయాన్ని వెల్లడించిన చైనా శాస్త్రవేత్తలు..

|

Dec 17, 2020 | 12:28 PM

ఓవైపు వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నా.. మరోవైపు ప్రజలను భయాందోళనకు గురి చేస్తూనే ఉంది కరోనా మహమ్మారి. చలికాలం నేపథ్యంలో వాతావరణ...

Coronavirus: ఆ ప్రాంతాల్లో కరోనా వైరస్ ముప్పు ఎక్కువట.. సంచలన విషయాన్ని వెల్లడించిన చైనా శాస్త్రవేత్తలు..
Follow us on

Coronavirus: ఓవైపు వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నా.. మరోవైపు ప్రజలను భయాందోళనకు గురి చేస్తూనే ఉంది కరోనా మహమ్మారి. చలికాలం నేపథ్యంలో వాతావరణ పరిస్థితులు వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉండటంతో కరోనా మరింత విజృంభిస్తోంది. ఇదిలాఉంటే, తాజాగా కరోనా మహమ్మారికి సంబంధించి చైనా శాస్త్రవేత్తలు సంచలన విషయాన్ని వెల్లడించారు. కరోనా వైరస్ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందో తేల్చి చెప్పారు. ఇరుకు మార్గాలల్లో కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందట. ఈ విషయాన్ని బీజింగ్‌లోని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు తమ నివేదికలో వెల్లడించారు.

 

వారు చేపట్టిన కంప్యూటర్ సిమ్యూలేషన్ అధ్యయనం ప్రకారం.. ఇరుకైన మార్గాల గుండా ఎవరైనా కరోనా వ్యాధిగ్రస్తులు వెళ్లినప్పుడు వారు తుమ్మినా, దగ్గినా వెలువడే తుంపరలు.. వారి వెనుకే దాదాపు నడుము ఎత్తులో ప్రయాణిస్తాయట. అలా కరోనా వైరస్ ప్రయాణిస్తున్న సమయంలో రోగి వెనుకవైపు పిల్లలు ఉన్నట్లయితే వారు కూడా కరోనా బారిన పడే ప్రమాదం ఉందన్నారు. అయితే విశాల మార్గాల్లో మాత్రం అంత ప్రమాదం ఉండదట. విశాల మార్గాల్లో గాలి ప్రసరణ ఎక్కువగా ఉండటంతో అవి వెంటనే చెల్లాచెదురుగా పడిపోతాయట. దీంతో కరోనా వ్యాప్తి ముప్పు తక్కువగా ఉంటుందని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ఇరుకైన మార్గాల్లో వెళ్లేప్పుడు కొంచె జాగ్రత్తలు పాటిస్తూ వెళ్లండి.

Also read:

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడానికి కారణం ఆయనే.. సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ వర్గీయ..

బెంగళూరు పోలీసు శాఖలో విషాదం.. స్నేహితురాలి ఇంట్లో సీఐడీ డీఎస్పీ ఆత్మహత్య.. కార‌ణం అదేనా..?