
కరోనా కాలంలో ఇండియాకు 5.5 లక్షల రాపిడ్ టెస్ట్ కిట్లు సరఫరా చేసిన చైనాలోని రెండు కంపెనీలు తమ కిట్స్ నాసిరకమైనవన్న ఆరోపణలను ఖండించాయి. గ్వాన్గ్ జౌ వాండ్ ఫో బయోటెక్, లివ్ జాన్ డయాగ్నస్టిక్స్ అనే ఈ సంస్థలు తాము తయారు చేసే కిట్స్ విషయంలో ఖఛ్చితమైన నాణ్యతా ప్రమాణాలను పాటిస్తామని తెలిపాయి. వీటిని స్టోర్ చేసినప్పుడు తగిన మార్గదర్శకాలను పాటించాలని, అలాగే వీటి వాడకంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ కంపెనీలు కోరాయి. ఈ సంస్థలు పంపిన రాపిడ్ టెస్ట్ కిట్స్ లోపభూయిష్టంగా, నాసిరకంగా ఉన్నాయని, అందువల్ల దీనిపై ఇన్వెస్టిగేషన్ ముగిసేవరకు రెండు రోజులపాటు వీటిని వాడరాదని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఇండియాలోని అన్ని రాష్ట్రాలనూ కోరింది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ లో తాము కూడా సహకరిస్తామని ఈ కంపెనీలు పేర్కొన్నాయి. ఇండియానుంచి వఛ్చిన ఈ విధమైన నెగెటివ్ రిపోర్టు చూసి తాము షాక్ తిన్నామని ఈ సంస్థలు విచారం వ్యక్తం చేశాయి.