భారత్ నుంచి చైనీయులు వెళ్తున్నారు

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరిగిపోతుండటంతో విదేశాల్లో ఉంటున్నవారిని వెనక్కి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది చైనా. ఇందులోభాగంగా భారత్‌లో ఉంటున్న చైనీయులందరినీ స్వదేశానికి తిరిగిరావాలని ఆదేశించింది. తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. స్వదేశానికి తిరిగివచ్చేవారు మాత్రం కొన్ని నిబంధనలను తప్పకుండా పాటించాలని సూచించింది. 14 రోజులపాటు క్వారంటైన్‌తోపాటు ఇతర వైద్యపరమైనవాటికి అంగీకరించాలని అందులో స్పష్టం చేసింది. మాండిరిన్ భాషలో ఉన్న ఈ ప్రకటన ప్రకారం కరోన వైరస్‌కు చికిత్స […]

భారత్ నుంచి చైనీయులు వెళ్తున్నారు

Edited By:

Updated on: May 26, 2020 | 12:04 PM

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరిగిపోతుండటంతో విదేశాల్లో ఉంటున్నవారిని వెనక్కి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది చైనా. ఇందులోభాగంగా భారత్‌లో ఉంటున్న చైనీయులందరినీ స్వదేశానికి తిరిగిరావాలని ఆదేశించింది. తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. స్వదేశానికి తిరిగివచ్చేవారు మాత్రం కొన్ని నిబంధనలను తప్పకుండా పాటించాలని సూచించింది. 14 రోజులపాటు క్వారంటైన్‌తోపాటు ఇతర వైద్యపరమైనవాటికి అంగీకరించాలని అందులో స్పష్టం చేసింది. మాండిరిన్ భాషలో ఉన్న ఈ ప్రకటన ప్రకారం కరోన వైరస్‌కు చికిత్స పొందిన వారు కానీ.. 14 రోజులు జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉన్నవారు ప్రత్యేక విమానంలో చోటు లేదని పేర్కొంది. భారత్‌తోపాటు ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా స్వదేశానికి తిరిగిరావాలని అందులో పేర్కొన్నారు. అయితే భారత్‌-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఈ ప్రకటనకు ప్రాధాన్యత పెరిగింది.