Coronavirus: టెర్రర్ పుట్టిస్తున్న కరోనా ఫోర్త్ వేవ్‌… ఇండియాకు పొంచి ఉన్న డేంజర్ ఎంత..

|

Dec 19, 2022 | 7:43 PM

ఏక్‌ దో తీన్… చార్… అంటోంది కోవిడ్ మహమ్మారి. ఫోర్త్‌ వేవ్ కమింగ్ సూన్ అనే డేంజర్ సిగ్నల్స్ చాలా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఇంకేముంది ఊసిపోయిందిలే అనుకుంటే... మళ్లీ ఉప్పెనలా ఎగబడుతోంది.. ప్రపంచాన్ని మళ్లీ తన గుప్పిట్లో పెట్టుకునేలా ఉంది. ఎస్... కరోనా భూతం మళ్లీ కోరలు చాచిందన్న వార్తలు... వెన్నుల్లో వణుకు పుట్టిస్తున్నాయి.

Coronavirus: టెర్రర్ పుట్టిస్తున్న కరోనా ఫోర్త్ వేవ్‌... ఇండియాకు పొంచి ఉన్న డేంజర్ ఎంత..
Covid 19
Follow us on

పొరుగుదేశం చైనాకు చచ్చేంత చావొచ్చి పడింది. కరోనా ఫోర్త్‌ వేవ్ కమింగ్‌ సూన్… నాలుగే నాలుగు నెలల్లో పది లక్షల మరణాల్ని చవిచూస్తారు.. గెట్ రెడీ అనే హెచ్చరికలతో ఉడికిపోతోంది డ్రాగన్ కంట్రీ. ప్రజా తిరుగుబాటుకు జడిసి రిసెంట్‌గానే జీరో కోవిడ్ నిబంధనల్ని ఎత్తేసింది చైనా ప్రభుత్వం. కానీ…ఇలా చేస్తే మీ చావును మీరే కొనితెచ్చుకున్నట్టు అంటూ హెచ్చరిస్తోంది IHME. అమెరికాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ వేసిన లెక్క ప్రకారం… మరో నాలుగు నెలల్లో చైనాలో పది లక్షల మంది కోవిడ్‌తో చచ్చిపోతారట. కోవిడ్ కేసుల విస్పోటనం పుట్టి… చైనాలో మూడో వంతు జనాభాకి ఇన్‌ఫెక్షన్ సోకుతుందట. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి నెల ఫస్టాఫ్‌ అంతా చైనాలో సెలవులు ప్రకటిస్తారు. ఈ గ్యాప్‌లోనే ప్రయాణాలు, పబ్లిక్ గ్యాదరింగ్స్‌ పెరిగి… లక్షలాది మంది కరోనా వైరస్‌కి దొరికిపోతారు. టోటల్‌గా ఏప్రిల్1లోగా మరణ మృదంగం పీక్స్‌కి చేరబోతోంది.

కోవిడ్‌ ఆనవాళ్లే లేకుండా చేద్దాం… మన ఫ్యూచర్‌ని మనమే కాపాడుకుందాం అంటూ జీరో కోవిడ్‌ గైడ్‌లైన్స్‌ పెట్టిన చైనా ఇప్పుడు యూటర్న్ తీసుకోక తప్పేలా లేదు. చైనాలో కోవిడ్‌తో ఇప్పటివరకు 5233 మంది చనిపోయారు. కానీ… జీరో కోవిడ్‌ గైడ్‌లైన్స్‌లో కట్టుదిట్టం చేశాక… డిసెంబర్ 3 తర్వాత ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. ఇలా రిలీఫ్ ఔతున్న చైనాను IHME రిపోర్ట్ వణికించిపారేస్తోంది. చైనాలో ఫోర్త్‌ వేవ్ వస్తే మనకేంటి… అని లైట్ తీసుకునే పరిస్థితి లేదిక్కడ. మొదట్లో చైనానుంచే ఇండియాకు దిగుమతైన కరోనా… ఇక్కడ మూడు విడతలుగా చెలరేగి… టెర్రర్ పుట్టించింది. ఒమిక్రాన్‌తోనే ఐపోయింది… ఇంకేముందిలే బతుకు భద్రం అని భరోసాతో ఉంటే… ఇదిగో వస్తున్నా ఫోర్త్‌వేవ్‌తో… మళ్లీ చైనా నుంచే… ఎంట్రీ ఇవ్వబోతోంది. బీజింగ్‌లో కోవిడ్ ఔట్‌బర్‌స్ట్ స్టార్టయిందన్న సంకేతాలు వచ్చీరాగానే… ఇక్కడ అలార్మింగ్ బెల్స్ మోగిపోతాయ్.

ఇండియాలో ఐదున్నర లక్షల మందిని బలితీసుకున్న కోవిడ్… ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. ఉండీ లేనట్టు… ఇండియాలో అక్కడక్కడా మాత్రమే ఉనికి చాటుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్ చీఫ్‌ మినిస్టర్ సుఖ్విందర్ కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం మన దేశంలో యాక్టివ్ కేసులు 3,559 మాత్రమే అని ఇవాళే ప్రకటించుకుంది హెల్త్ మినిస్ట్రీ. కానీ… చైనాలో ఫోర్త్‌ వేవ్‌ మొదలైతే.. ఆ ప్రభావం ఇండియాతో పాటు ఏషియన్ కంట్రీస్ మొత్తమ్మీద పడే ప్రమాదం ఉంది. ఇక్కడే చిన్న ఉపశమనం… మన వ్యాక్సిన్లు బలవర్థకమైనవి.. ఫోర్త్‌ వేవ్ వచ్చినా భయపడేంత ప్రమాదం ఏమీ ఉండదనే వార్తలు రిలీఫ్‌నిచ్చేవే. వ్యాక్సిన్ వేయించుకున్నవారికి ఫోర్త్‌ వేవ్‌ ప్రాణాంతకం కాదంటోంది INSA…ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ. రిసెంట్‌గా విశాఖలో జరిగిన సెమినార్‌లో ఈ శుభవార్త వినపించింది. కాకపోతే… రష్యన్‌ ఫ్లూ, స్పానిష్‌ ఫ్లూ, హెచ్‌1ఎన్‌1 లాగే… కోవిడ్‌-19… కూడా దీర్ఘకాల ప్రభావం చూపినట్టే కనిపిస్తాయని, అంత ముప్పు మాత్రం ఉండబోదని చెబుతున్నారు మెడికల్ ఎక్స్‌పర్ట్స్.

చైనా దేశంలో ఐతే చావుకళ ఉట్టిపడుతోంది. ఇప్పటికే జీరో కోవిడ్ నిబంధనలతో వైరస్‌ని అదుపు చేయగలిగినా.. పారిశ్రామికంగా, ఆర్థికంగా చితికిపోయింది డ్రాగన్ కంట్రీ. IHME హెచ్చరికలు రియాలిటీలోకొస్తే… అలనాటి పీడకలలు రిపీటై… 2019లాగే 2023 కూడా చైనాకు గుర్తుండిపోయే క్యాలెండర్‌ కావచ్చు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..