ఐపీఎల్ భవితవ్యం తేల్చేది కేంద్రమే..

|

May 24, 2020 | 9:18 PM

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఐపీఎల్ 13వ సీజన్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ 4.0లో కేంద్రం.. వీక్షకులు లేకుండా స్టేడియంలను తెరుచుకునే అవకాశాన్ని కల్పించడంతో పాటు అక్టోబర్- నవంబర్ మధ్య జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా వేయాలని ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా చూస్తుండటంతో మళ్లీ ఐపీఎల్ జరుగుతుందని క్రికెట్ లవర్స్ అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ నిర్వహణపై కేంద్ర […]

ఐపీఎల్ భవితవ్యం తేల్చేది కేంద్రమే..
Follow us on

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఐపీఎల్ 13వ సీజన్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ 4.0లో కేంద్రం.. వీక్షకులు లేకుండా స్టేడియంలను తెరుచుకునే అవకాశాన్ని కల్పించడంతో పాటు అక్టోబర్- నవంబర్ మధ్య జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా వేయాలని ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా చూస్తుండటంతో మళ్లీ ఐపీఎల్ జరుగుతుందని క్రికెట్ లవర్స్ అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఐపీఎల్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని.. BCCI కాదని వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అంచనా వేసి ఐపీఎల్ ఈ ఏడాది నిర్వహించాలా? లేదా? అనేది నిర్ణయిస్తామన్నారు. ప్రస్తుతం తమ దృష్టి అంతా కూడా కరోనాను ఎదుర్కోవడంపైనే ఉందన్న ఆయన.. క్రీడా టోర్నమెంట్ల కోసం ప్రజల జీవితాలను రిస్క్‌లో పెట్టలేమని వెల్లడించారు. కాగా, త్వరలోనే IPL నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.