కరోనా కాటుతో బల్గేరియన్ రెజ్లర్ మృతి

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీనికి వ్యాక్సిన్ కానీ.. సరైన మందు కానీ లేకపోవడంతో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ వైరస్ బారినపడి సామాన్య ప్రజల నుంచి మొదలు..అనేక విభాగాలకు..

కరోనా కాటుతో బల్గేరియన్ రెజ్లర్ మృతి

Edited By:

Updated on: Jul 16, 2020 | 7:16 AM

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీనికి వ్యాక్సిన్ కానీ.. సరైన మందు కానీ లేకపోవడంతో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ వైరస్ బారినపడి సామాన్య ప్రజల నుంచి మొదలు.. అనేక విభాగాలకు చెందిన వారు మరణిస్తున్నారు. తాజాగా బల్గేరియాకు చెందిన మాజీ రెజ్లింగ్‌ చాంపియన్ నికోలాయ్ షెటెరెవ్ మరణించారు. ఈయన వయస్సు 33 ఏళ్లు. గత నెలలో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే జూన్‌న ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ బుధవారం నాడు మరణించారు. ఈ విషయాన్ని బల్గేరియన్ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ప్రకటించింది.