‘కరోనా పాజిటివ్ వచ్చింది..అయినా పాలన సాగిస్తా’.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

| Edited By: Pardhasaradhi Peri

Mar 27, 2020 | 5:59 PM

తనకు కరోనా పాజిటివ్ లక్షణాలు సోకినట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. స్వల్పజ్వరం, దగ్గుతో బాధపడిన తాను టెస్ట్ చేయించుకున్నానని, ఈ టెస్టులో ఈ లక్షణాలు ఉన్నట్టు బయట పడిందని చెప్పిన ఆయన.. ఇక సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటానని పేర్కొన్నారు, అయితే వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాలన కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. నిత్యం ఇతర సీనియర్ మంత్రులు, అధికారులతో బిజీగా, సన్నిహితంగా ఉండే బోరిస్ జాన్సన్ స్వయంగా ఈ ప్రకటన చేయడంతో వారందరిలోనూ ఆందోళన […]

కరోనా పాజిటివ్ వచ్చింది..అయినా పాలన సాగిస్తా.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
Follow us on

తనకు కరోనా పాజిటివ్ లక్షణాలు సోకినట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. స్వల్పజ్వరం, దగ్గుతో బాధపడిన తాను టెస్ట్ చేయించుకున్నానని, ఈ టెస్టులో ఈ లక్షణాలు ఉన్నట్టు బయట పడిందని చెప్పిన ఆయన.. ఇక సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటానని పేర్కొన్నారు, అయితే వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాలన కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. నిత్యం ఇతర సీనియర్ మంత్రులు, అధికారులతో బిజీగా, సన్నిహితంగా ఉండే బోరిస్ జాన్సన్ స్వయంగా ఈ ప్రకటన చేయడంతో వారందరిలోనూ ఆందోళన మొదలైంది. అటు ప్రస్తుతం గర్భిణిగా ఉన్న జాన్సన్ పార్ట్ నర్ క్యారీ సైమండ్స్ కి కూడా కరోనా సోకవచ్ఛుననే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే ప్రిన్స్ చార్లెస్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అలాగే బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి నాడీన్ డోరిస్ కోలుకుని మళ్ళీ విధులకు హాజరవుతున్నారు. బ్రిటన్ లో కరోనా మృతుల సంఖ్య 578 కి పెరిగింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం ఈ వ్యాధి బారిన పడినా కోలుకున్నారు.