కోవిడ్ వ్యాక్సిన్‌పై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా తాను వేసుకునేది లేదని తేల్చి చెప్పారు. వాక్సిన్ తీసుకోకపోవడం తన హక్కు అని ఉద్ఘాటించారు. అంతేకాదు, కోవిడ్ 19 టీకాపై జరుగుతున్న ప్రచారాన్ని సైతం తప్పుపట్టిన ఆయన.. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా బ్రెజిల్ ప్రజలు ఆ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. బొల్సనారో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
కాగా, కోవిడ్ వ్యాప్తిపై ఆయన గతంలోనూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాస్క్ ధరించడం వల్ల కోవిడ్ సోకదని కచ్చితంగా ఎవరూ చెప్పలేదన్నారు. బ్రెజిల్ ప్రజలకు వ్యాక్సిన్ అవసరం లేదని, తన పెంపుడు కుక్కకు మాత్రం ఆ వ్యాక్సిన్ వేయిస్తానంటూ బొల్సనారో ట్వీట్ చేశాడు. అప్పుడది తీవ్ర వివాదాస్పదమైంది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వల్ల అత్యధిక మరణాలు సంభవించిన దేశాల జాబితాలో బ్రెజిల్ రెండవ స్థానంలో ఉంది. అయినప్పటికీ బొల్సనారొ కోవిడ్ మహమ్మారిని సీరియస్‌గా తీసుకోకపోవడం ఆశ్చర్యకరం.
Also Read :