అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు -బాలకృష్ణ

|

Jun 11, 2020 | 10:16 PM

తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు నందమూరి బాలకృష్ణ. గత కొన్నిరోజులుగా వివిధ మాధ్యమాల ద్వారా తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని.. వారికి పేరు పేరునా థాంక్స్ అన్నారు. “మా చిత్ర పరిశ్రమ ప్రముఖులకు, దర్శక నిర్మాతలకు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు, కళాకారులకు, హితులకు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ సిబ్బందికి, ఎన్బీకే ఫ్యాన్స్ కన్వీనర్స్ కు, ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ వారికి , మన బాలయ్య.కామ్ నిర్వాహకులకు, […]

అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు -బాలకృష్ణ
Follow us on

తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు నందమూరి బాలకృష్ణ. గత కొన్నిరోజులుగా వివిధ మాధ్యమాల ద్వారా తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని.. వారికి పేరు పేరునా థాంక్స్ అన్నారు.

“మా చిత్ర పరిశ్రమ ప్రముఖులకు, దర్శక నిర్మాతలకు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు, కళాకారులకు, హితులకు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ సిబ్బందికి, ఎన్బీకే ఫ్యాన్స్ కన్వీనర్స్ కు, ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ వారికి , మన బాలయ్య.కామ్ నిర్వాహకులకు, ఎన్నారై ఫ్యాన్స్ కు పేరుపేరునా కృతజ్ఞతాభివందనాలు” అంటూ ట్విట్టర్ లో పోస్టు చేశారు.

ఎలాంటి స్వార్థం లేకుండా ఎల్లవేళలా తన వెంట నడుస్తూ.. తన పుట్టినరోజును ఒక పండుగలా జరుపుకునే అభిమానులకు కృతజ్ఞతలు అంటూ తన పోస్టులో తెలిపారు.