
కరోనా క్వారంటైన్ సెంటర్లంటే సామాన్య ప్రజలు పేరు తలచడానికే బయటపడుతారు. ఇక అందులోకి వైద్యులు వెళ్లాలంటే కూడా పీపీఈ కిట్లు ధరిచంకుండా అడుగు కూడా పెట్టరు. ఎందుకంటే ఎక్కడ తమకు కూడా కరోనా మహమ్మారి సోకుతుందోనన్న భయం. అంతేకాదు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు కూడా.. పక్కన ఉన్న వారిని పలకరించడానికి కూడా భయపడుతుంటారు. అయితే అసోంలో ఓ క్వారంటైన్ సెంటర్లో మాత్రం అందుకు భిన్నంగా అక్కడ ఉన్న కరోనా బాధితులంతా ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. వారి ప్రతిభనంతా అక్కడ చూపిస్తూ.. అసలు కరోనా సోకిందన్న విషయమే మర్చిపోయి ఆహ్లాదంగా గడుపుతున్నారు. అసోం రాష్ర్టం డిబ్రుఘర్ జిల్లాలోని ఓ క్వారంటైన్ సెంటర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ యుక్త వయస్సులో ఉన్న ఓ కరోనా బాధితుడు.. పిల్లనగ్రోవితో పాటలు పాడుతుంటే.. మరోకరు అందుకు అనుగునంగా స్టెప్పులేసి అక్కడ ఉన్నవారందర్నీ ఉత్తేజపరుస్తున్నాడు. ఇలా
అంతా కలిసి డ్యాన్స్ చేస్తూ.. కరోనా ఉందన్న విషయాన్ని మర్చిపోయి.. చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.