క‌రోనా ఎఫెక్ట్ః ప్ర‌ధాని మోదీ కొత్త విమానం మ‌రింత ఆల‌స్యం!

రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని ప్రయాణల కోసం అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ‌తో భార‌త్ రెండు బీ777 విమానాలను త‌యారు చేయిస్తోంది. వీటిలో ఒక‌టి ఈ వారంలో భార‌త్‌కు రావాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. సాంకేతిక కార‌ణాల వ‌ల్ల ఇంకా డెలివరీ ఆల‌స్య‌మ‌వుతుంద‌ని ఎయిర్ ఇండియా..

క‌రోనా ఎఫెక్ట్ః ప్ర‌ధాని మోదీ కొత్త విమానం మ‌రింత ఆల‌స్యం!

Edited By:

Updated on: Aug 26, 2020 | 12:30 PM

రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని ప్రయాణల కోసం అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ‌తో భార‌త్ రెండు బీ777 విమానాలను త‌యారు చేయిస్తోంది. వీటిలో ఒక‌టి ఈ వారంలో భార‌త్‌కు రావాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. సాంకేతిక కార‌ణాల వ‌ల్ల ఇంకా డెలివరీ ఆల‌స్య‌మ‌వుతుంద‌ని ఎయిర్ ఇండియా అధికారులు వెల్ల‌డించారు. వాస్త‌వానికి ఈ విమానుల‌ను బోయింగ్ జులైలోనే డెలివ‌రీ చేయాల్సి ఉంది. అయితే క‌రోనా వైర‌స్ సంక్షోభం కార‌ణంగా స‌కాలంలో రాలేక‌పోయిన‌ట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ రెండు బీ777 విమానాల‌ను భార‌త వాయుసేన పైల‌ట్లే ఆప‌రేట్ చేస్తారు. వీటి నిర్వ‌హ‌ణ బాధ్య‌త మాత్రం ఎయిర్ ఇండియా చూసుకుంటుంది. కాగా ప్ర‌ధాని, రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ప్ర‌స్తుతం బీ 747 విమానాల్లో ప్ర‌యాణిస్తున్నారు. ఇది ఎయిర్ ఇండియా వ‌న్ గుర్తును క‌లిగి ఉంటుంది. ఎయిర్ ఇండియా పైలెట్లే దీన్ని ఆప‌రేట్ చేస్తున్నారు. బోయింగ్ తయారు చేస్తున్న బీ 777 విమానాల్లో అత్యాధినిక ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌, సెల్ఫ్ ప్రొటెక్ష‌న్ సూట్ల‌ను ఉప‌యోగించ‌నున్నారు.

Read More:

బ్రేకింగ్ః తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్

ఆ ప్ర‌భుత్వ‌ ఉద్యోగులకు సీఎం జ‌గ‌న్‌ గుడ్ న్యూస్‌

బిగ్‌బాస్-4 కంటెస్టెంట్‌కి కరోనా పాజిటివ్?