క‌రోనా ప‌ర్య‌వేక్ష‌కులుగా ఎపికి నిర్మ‌లా, తెలంగాణ‌కు కిష‌న్ రెడ్డి…..

| Edited By: Pardhasaradhi Peri

Mar 27, 2020 | 6:54 PM

కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ విధించింది. చాలా రాష్ట్రాల్లో ఇది విజయవంతంగా అమలవుతోంది. ఈ క్రమంలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించేందుకు ఇద్దరు మంత్రులను..

క‌రోనా ప‌ర్య‌వేక్ష‌కులుగా ఎపికి నిర్మ‌లా, తెలంగాణ‌కు కిష‌న్ రెడ్డి…..
Follow us on

కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ విధించింది. చాలా రాష్ట్రాల్లో ఇది విజయవంతంగా అమలవుతోంది. ఈ క్రమంలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించేందుకు ఇద్దరు మంత్రులను కేంద్రం నియమించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగా తెలంగాణలోని 33 జిల్లాల అధికారులతో కిషన్ రెడ్డి సంప్రదింపులు జరపనున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు చెందిన అధికారులతో సమన్వయం చేసే బాధ్యతను నిర్మల సీతారామన్ తీసుకోనున్నారు. కరోనా పరిస్థితి, సహాయక చర్యలపై నేరుగా అధికారులతో చర్చించి వారిద్దరూ ఎప్పటికప్పుడు వివరాలు సేకరించనున్నారు. వాటి ఆధారంగా అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగాలకు తగిన సూచనలు ఇవ్వాలని కేంద్ర మంత్రులను ప్రధాని మోదీ ఆదేశించారు. తెలంగాణలో ఇప్పటి వరకు 59 కేసులు నమోదు కాగా… ఏపీలో 12 మందికి కరోనా వైరస్‌ సోకింది.