కుటుంబంలో ఒక్కరికి మాత్రమే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

|

Apr 25, 2020 | 10:31 AM

ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కంటైన్‌మెంట్‌ జోన్లలో నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అత్యవసర పాస్‌ను ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా నిత్యావసర షాపులు వీధి చివరలోనే ఉండేలా చూడాలన్నారు. రైతు బజార్లను వీలైనంత ఎక్కువగా వీకేంద్రీకరించాలన్న ఆయన.. టమాటా, ఉల్లితో పాటు అన్ని ఉత్పత్తుల మార్కెటింగ్ ధరలపై దృష్టి సారించాలని తెలిపారు. కాగా, రాష్ట్రంలో […]

కుటుంబంలో ఒక్కరికి మాత్రమే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
Follow us on

ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కంటైన్‌మెంట్‌ జోన్లలో నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అత్యవసర పాస్‌ను ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.

అంతేకాకుండా నిత్యావసర షాపులు వీధి చివరలోనే ఉండేలా చూడాలన్నారు. రైతు బజార్లను వీలైనంత ఎక్కువగా వీకేంద్రీకరించాలన్న ఆయన.. టమాటా, ఉల్లితో పాటు అన్ని ఉత్పత్తుల మార్కెటింగ్ ధరలపై దృష్టి సారించాలని తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 955 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 29 మంది మృతి చెందారు. అటు 145 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక అత్యధిక పాజిటివ్ కేసులు కర్నూలు(261), గుంటూరు(206) జిల్లాల్లో నమోదయ్యాయి.

ఇవి చదవండి:

మసీదులు తెరుస్తారా.? దేవుడి ఆగ్రహానికి గురవుతారా.?.. ఇమామ్‌ల అల్టిమేటం..

గాంధీ ఆసుపత్రి కంటే జైలు బెటర్.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.

రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోండి.. ముస్లింలకు ఓవైసీ విజ్ఞప్తి..

కరోనా ముస్లిం పేషంట్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..