ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 61678 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1217 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 2001255కి చేరింది. కొత్తగా మరో 13 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 13715కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 15141 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా 24 గంటల వ్యవధిలో 1535 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా రికవరీల సంఖ్య 1972399కి చేరింది. కొత్తగా నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 198 కేసులు నమోదయ్యాయి. కొత్తగా కోవిడ్ కారణంగా కృష్ణా జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఒకరు, తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు, విశాఖ జిల్లాలో ఒకరు చొప్పున మరణించారు.
జిల్లాలవారీగా కేసుల వివరాలను దిగువన పట్టికలో చూడండి..
#COVIDUpdates: 21/08/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,98,360 పాజిటివ్ కేసు లకు గాను
*19,69,504 మంది డిశ్చార్జ్ కాగా
*13,715 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 15,141#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/mFBFWZuske— ArogyaAndhra (@ArogyaAndhra) August 21, 2021
కరోనా సమాచారం ఇక నుండి మీ చేతుల్లోనే:
● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయడి.
● స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు
● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు
● https://esanjeevani.com/ వెబ్ సైట్ ద్వా రా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు.
● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app. క్రింద లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి.
https://play.google.com/store/apps/details?id=com.entrolabs.apcovid19
Also Read: వరంగల్‌లో రాహుల్ గాంధీ సభ.. కాంగ్రెస్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?