108 ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. భారీగా జీతాలు పెంపు

| Edited By:

Jul 01, 2020 | 2:05 PM

108, 104 ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ వరాల జల్లు కురిపించారు. 108, 104 ఉద్యోగుల జీతాలను భారీగా పెంచారు సీఎం. 108 సర్వీసుల్లో పనిచేస్తున్న డ్రైవర్‌కు గతంలో రూ.10వేలు అయితే, ఇప్పుడు సర్వీసును బట్టి రూ.18వేల నుంచి..

108 ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. భారీగా జీతాలు పెంపు
Follow us on

కాసేపటి క్రితమే ఏపీలో అధునాతన 104, 108 అంబులెన్స్‌లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. దాదాపు 1068 వాహనాలను సీఎం జెండా ఊపి ప్రారంభించగా.. అంబులెన్స్‌లు ప్రజాసేవకు పయనమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ మండలంలో ఈ వెహికిల్స్ అందుబాటులో ఉండబోతున్నాయి.

ఈ నేపథ్యంలో 108, 104 ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ వరాల జల్లు కురిపించారు. 108, 104 ఉద్యోగుల జీతాలను భారీగా పెంచారు సీఎం. 108 సర్వీసుల్లో పనిచేస్తున్న డ్రైవర్‌కు గతంలో రూ.10వేలు అయితే, ఇప్పుడు సర్వీసును బట్టి రూ.18వేల నుంచి రూ.28వేల వరకూ జీతం పెంచాలని అధికారులకు సూచించారు. ఇక ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ గతంలో రూ.12 వేల అయితే ఇప్పుడు రూ.20వేల నుంచి 30వేల వరకూ జీతం పెరగనుంది.

కాగా సుమారు రూ. 201 కోట్ల వ్యయంతో ఈ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగంలోకి తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. అలాగే 676 నూతన 104 వాహనాలు, 412 కొత్త 108 వాహనాలు రోడ్డెక్కాయి. ఇక అటు పిల్లలు, గర్భిణీల కోసం నియోనిటల్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా.. ఇందులో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

 Read More: 

మారిన ఏటీఎం, బ్యాంకు, పీఎఫ్ రూల్స్ వివరాలివే..