ఎవ్వరూ పస్తులు ఉండొద్దు.. జగన్ కీలక ఆదేశాలు..!

రాష్ట్రంలో ఎవ్వరూ పస్తులు ఉండొద్దని సీఎం వైఎస్‌ జగన్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్‌ తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.వెయ్యి ఇవ్వాలని.. ఎవ్వరూ పస్తులు ఉండకుండా చూడాలని ఆయన అన్నారు.

ఎవ్వరూ పస్తులు ఉండొద్దు.. జగన్ కీలక ఆదేశాలు..!

Updated on: Apr 14, 2020 | 9:49 PM

రాష్ట్రంలో ఎవ్వరూ పస్తులు ఉండొద్దని సీఎం వైఎస్‌ జగన్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్‌ తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.వెయ్యి ఇవ్వాలని.. ఎవ్వరూ పస్తులు ఉండకుండా చూడాలని ఆయన అన్నారు. అర్హత ఉండి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వారంలోగా కార్డులు అందించాలని జగన్ పేర్కొన్నారు.

కరోనా నియంత్రణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫిరెన్స్‌ నిర్వహించిన సీఎం.. వైరస్‌ నియంత్రణ కోసం తీసుకుంటోన్న చర్యలు, రెడ్‌ జోన్స్‌లో అమలవుతోన్న లాక్‌డౌన్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కుటుంబ ఆరోగ్య సర్వే సమగ్రంగా నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రతి ఆసుపత్రిలో ఐసోలేషన్‌ సదుపాయం అందుబాటులో ఉండాలని.. రోగికి జాగ్రత్తగా వైద్యం అందించే విధంగా చూడాలని పేర్కొన్నారు. క్వారంటైన్‌ పూర్తై ఇంటికి వెళ్లిన వారిపై పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఎల్లప్పుడూ పీపీఈలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని వైఎస్‌ జగన్ సూచించారు.

Read This Story Also: లాక్‌డౌన్‌ 2.0: మోదీపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు

Loading...
Unable to load recommendations.
Follow Us