AP CORONA CASES: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పెరుగుతున్నట్టే రాష్ట్రంలో సైతం కేసులు రెట్టింపు అవుతుండటం ఆందోళన కల్గిస్తోంది. తాజాగా కోవిడ్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగాయి. గడిచిన 24గంల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 7,224 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వైరస్ మహమ్మారి బారిన పడి మరో 15 ప్రాణాలను కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 9,55,455కి కరోనా కేసులు నమోదు కాగా, ఇప్పటివరకు కరోనా వైరస్ తో 7,388 మరణించారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదలచేసిన బులెటిన్‌లో పేర్కొంది.
ఇక, గడిచిన 24గంటల వ్యవధిలో చిత్తూరులో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, కర్నూలు, విశాఖలో ఇద్దరు చొప్పున గుంటూరు, కడప, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మహమ్మారికి బలయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,388కి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,332 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,07,598కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 40,469 యాక్టివ్ కేసులతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తంగా 1,56,42,070 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో 1,051, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 96 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో వరుసగా రెండో రోజూ వెయ్యికిపైగా కేసులు నమోదు కావడం గమనార్హం.
ఇక, జిల్లాల వారీ నమోదైన కోవిడ్ కేసులు వివరాలు ఇలా ఉన్నాయి…