
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హిట్ చిత్రం దువ్వాడ జగన్నాథం(DJ)కు నేటికి మూడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర బృందం కొన్ని స్టిల్స్‌ను విడుదల చేసింది. బన్ని పోలీస్ గెటప్‌లో, పూజా హెగ్డే పంచెకట్టులో ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
దువ్వాడ జగన్నాథం(DJ)విడుదలై నేటితో మూడుళ్లు అయిన సందర్భంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశాడు బన్నీ. తన జీవితంలో గుర్తుండిపోయే చిత్రంగా చేసిన చిత్రబృందానికి, ముఖ్యంగా నా ఆర్మీకి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ప్రకటించారు దువ్వాడ జగన్నాథం.
మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటించారు. దువ్వాడ జగన్నాథ శాస్త్రి పాత్రలో వంటమనిషి పాత్రలో అల్లు అర్జున్ మెప్పించారు. పెళ్లిళ్లలో తన వంటకాల రుచిని అందరికీ పంచుతూ, తన చేతి వంటకు అందరు ఫిదా అయ్యేలా చేశారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఏ వేడుకకైనా జగన్నాథాన్నే పిలిచి వంట చేయిస్తారు.