ఆఫ్ఘన్ ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. క్వారంటైన్‌కి తరలింపు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదపు నలభై లక్షల మందికి పైగా కరోనా సోకింది. వీరిలో పన్నెండు లక్షల మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవ్వగా.. మరో రెండున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ వైరస్ ప్రపంచ దేశాలన్నింటిని చుట్టేసింది. కులం, మతం, భాష, ప్రాంతం అన్న తేడా లేకుండా.. అందర్నీ కాటేస్తోంది. తాజాగా ఆఫ్ఘన్ ఆరోగ్యశాఖ మంత్రి ఫిరోజుద్దీన్‌ ఫిరోజ్‌ని కూడా […]

ఆఫ్ఘన్ ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. క్వారంటైన్‌కి తరలింపు

Edited By:

Updated on: May 08, 2020 | 4:54 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదపు నలభై లక్షల మందికి పైగా కరోనా సోకింది. వీరిలో పన్నెండు లక్షల మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవ్వగా.. మరో రెండున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ వైరస్ ప్రపంచ దేశాలన్నింటిని చుట్టేసింది. కులం, మతం, భాష, ప్రాంతం అన్న తేడా లేకుండా.. అందర్నీ కాటేస్తోంది. తాజాగా ఆఫ్ఘన్ ఆరోగ్యశాఖ మంత్రి ఫిరోజుద్దీన్‌ ఫిరోజ్‌ని కూడా కాటేసింది. ఈ విషయాన్ని ఆఫ్ఘన్ దేశ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. అనారోగ్యంతో ఉండటంతో పాటు.. కరోనా లక్షణాలు ఉండటంతో.. ఆయనకు కరోనా టెస్టులు జరిపామని.. రిపోర్టులో కరోనా పాజిటివ్ అని తేలిందని తెలిపారు. దీంతో ఆయన్ను క్వారెంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు.

కాగా, గడిచిన 24 గంటల్లో ఆఫ్ఘనిస్తాన్ దేశ వ్యాప్తంగా కొత్తగా 215 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాని అధికారులు ప్రకటించారు. దీంతో దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 3700కి చేరింది. ఇక ఈ మహమ్మారి బారినపడి దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు వంద మంది వరకు ప్రాణాలు విడిచారు.