
మొన్నటి వరకు ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ పోలీసులను టచ్ చేసిన కరోనా మహమ్మారి.. ఇప్పుడు కర్ణాటక పోలీసులను కూడా టచ్ చేస్తోంది. బెంగళూరులోని నలుగురు పోలీస్ సిబ్బందికి.. మంగళవారం నాడు కరోనా పాజిటివ్‌గా తేలింది. నగరంలోని మర్తహాలీ పోలీస్ స్టేషన్‌కు చెందిన సిబ్బందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో పదివేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. మంగళవారం ఉదయం నాటికి.. 9,399 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ప్రస్తుతం 3,527 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో బ్రెజిల్ మాదిరి కాకుండా జాగ్రత్త పడాలంటూ మాజీ సీఎం అన్నారు. 20 రోజుల పాటు లాక్‌డౌన్ విధించి.. కేసులు గుర్తించి.. కరోనాను కట్టడి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.