షాకింగ్‌.. ఆ పాల డెయిరీ ప్లాంట్‌లో 13 మందికి కరోనా.. భయాందోళనలో ప్రజలు..

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా.. అన్ని వర్గాల ప్రజల్ని తాకుతోంది. తాజాగా.. పాలడైరీలో పనిచేసే వర్కర్స్‌ను తాకడం కలకలం రేపుతోంది.

షాకింగ్‌.. ఆ పాల డెయిరీ ప్లాంట్‌లో 13 మందికి కరోనా.. భయాందోళనలో ప్రజలు..

Edited By:

Updated on: Jun 02, 2020 | 7:06 PM

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా.. అన్ని వర్గాల ప్రజల్ని తాకుతోంది. పేద, ధనిక, రాజకీయ, పోలీస్, జర్నలిస్ట్‌ ఇలా ప్రాంతం, మతం, వర్గంతో తేడా లేకుండా.. అందర్నీ తాకుతోంది. తాజాగా.. పాలడైరీలో పనిచేసే వర్కర్స్‌ను తాకడం కలకలం రేపుతోంది. రాజస్థాన్‌ జోధ్‌పూర్‌ జిల్లాలోని ఓ పాల డెయిరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ సంఘటనపై డెయిరీ యాజమాన్యం స్పందించిది. డెయిరీకి సంబంధించిన 13 మంది వర్కర్స్‌కు కరోనా పాజిటివ్ అని తేలిందని.. అయితే వీరంతా ప్లాంట్‌ బయట పనిచేసేవారని.. వైరస్‌ ప్లాంట్‌లోనికి వచ్చే అవకాశం ఉండదని తెలిపారు. అంతేకాదు.. పాల పాశ్చరైజేషన్‌లో కానీ, ప్యాకింగ్ విభాగంలో పనిచేసే వారికి రాలేదని.. ప్రజలెవరూ బయపడాల్సిన అవసరం లేదని ఆ పాల డెయిరీ సంస్థకు చెందిన అధికారి స్పష్టం చేశారు. మరోవైపు రాజస్థాన్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెద్ద ఎత్తున నమోదవుతోంది.