“మహా” పోలీసులను వదలని కరోనా.. తాజాగా మరో 116 మందికి..

| Edited By:

May 29, 2020 | 5:08 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా లక్షా అరవై వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. అందులో ఎక్కువగా  మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. అయితే మహారాష్ట్రలో ఇప్పుడు కరోనా పోలీసులను వదలడం లేదు. ఇప్పటికే రెండు వేలమంది సిబ్బందికి పైగా కరోనా సోకింది. తాజాగా శుక్రవారం మరో 116 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. అంతేకాదు.. గడిచిన 24 గంటల్లో ముగ్గురు పోలీసులు కూడా కరోనా సోకి ప్రాణాలు […]

మహా పోలీసులను వదలని కరోనా.. తాజాగా మరో 116 మందికి..
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా లక్షా అరవై వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. అందులో ఎక్కువగా  మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. అయితే మహారాష్ట్రలో ఇప్పుడు కరోనా పోలీసులను వదలడం లేదు. ఇప్పటికే రెండు వేలమంది సిబ్బందికి పైగా కరోనా సోకింది. తాజాగా శుక్రవారం మరో 116 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. అంతేకాదు.. గడిచిన 24 గంటల్లో ముగ్గురు పోలీసులు కూడా కరోనా సోకి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడ్డ పోలీసుల సంఖ్య 2,211 చేరింది. వీరిలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది వందల మంది వరకు కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అరవై వేల మంది వరకు కరోనా పాజిటివ్ సోకింది. వీరిలో పద్దెనిమిది వేల మంది వరకు కోలుకోగా.. దాదాపు రెండు వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.