కరోనా వైరస్ వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ మొదలు..ఎయిమ్స్ డైరెక్టర్

దేశీయంగా తయారైన కరోనా వైరస్ వ్యాక్సీన్..'కోవ్యాక్సీన్' హ్యూమన్ ట్రయల్స్ సోమవారం నుంచి మొదలైందని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ప్రకటించారు. తొలి సెట్ డేటా సేకరణ కోసం రీసెర్చర్లకు..

కరోనా వైరస్ వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ మొదలు..ఎయిమ్స్ డైరెక్టర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 20, 2020 | 7:27 PM

దేశీయంగా తయారైన కరోనా వైరస్ వ్యాక్సీన్..’కోవ్యాక్సీన్’ హ్యూమన్ ట్రయల్స్ సోమవారం నుంచి మొదలైందని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ప్రకటించారు. తొలి సెట్ డేటా సేకరణ కోసం రీసెర్చర్లకు మూడు నెలల సమయం పడుతుందని ఆయన చెప్పారు. ఇది దేశీయ వ్యాక్సీన్ అని, ఓ కొత్త వ్యాక్సీన్ తయారీ అన్నది మన విజయమే అని ఆయన పేర్కొన్నారు. కాగా ఆరోగ్యంగా ఉన్న 1125 మంది వలంటీర్లకు ఇనాక్టివేట్ చేసిన ‘సార్స్-కోవ్-2’ఇంజెక్షన్ ఇఛ్చిన పక్షంలో.. ఈ వైరస్ ని ఎదుర్కొనే యాంటీ బాడీలను వారి శరీరాలు ఉత్పత్తి చేయగలుగుతాయా అన్న విషయాన్ని పరిశీలించనున్నారు. తొలి దశలో 375 మంది వలంటీర్లను ఎంపిక చేయగా రెండో దశ కోసం 750 మందిని ఎంపిక చేయనున్నారు. మూడో దశలో మరింతమందిని సెలెక్ట్ చేయనున్నారని ఆయన వివరించారు.