వృద్ధులను ఇలా కాపాడుకుందాం..రాష్ట్రాల‌కు కేంద్రం కీల‌క సూచ‌న‌లు..

ఇండియాలో కోవిడ్-19 వైరస్ ఎక్కువ‌గా 21 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు వారికి అటాక్ అవుతోంది. అయితే ఈ డేంజ‌ర‌స్ వైర‌స్ వల్ల ఎక్కువ‌గా చనిపోతున్న వారు మాత్రం 60 ఏళ్లు పైబ‌డిన‌వారే. అప్ప‌టికే వివిధ ర‌కాల వ్యాధులతో బాధపడుతుండ‌టం..రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండంటంతో వారు త్వ‌ర‌గా త‌నువు చాలిస్తున్నారు. దీనికి అడ్డ‌క‌ట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం..రాష్ట్రాల‌కు కీల‌క మార్గ‌నిర్దేశ‌కాలు విడుద‌ల చేసింది. వృద్ధుల రక్షణకు కొన్ని సూచనల్ని ఆదేశాల రూపంలో చేసింది. […]

వృద్ధులను ఇలా కాపాడుకుందాం..రాష్ట్రాల‌కు కేంద్రం కీల‌క సూచ‌న‌లు..
Elders
Follow us

|

Updated on: Apr 14, 2020 | 9:57 AM

ఇండియాలో కోవిడ్-19 వైరస్ ఎక్కువ‌గా 21 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు వారికి అటాక్ అవుతోంది. అయితే ఈ డేంజ‌ర‌స్ వైర‌స్ వల్ల ఎక్కువ‌గా చనిపోతున్న వారు మాత్రం 60 ఏళ్లు పైబ‌డిన‌వారే. అప్ప‌టికే వివిధ ర‌కాల వ్యాధులతో బాధపడుతుండ‌టం..రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండంటంతో వారు త్వ‌ర‌గా త‌నువు చాలిస్తున్నారు. దీనికి అడ్డ‌క‌ట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం..రాష్ట్రాల‌కు కీల‌క మార్గ‌నిర్దేశ‌కాలు విడుద‌ల చేసింది. వృద్ధుల రక్షణకు కొన్ని సూచనల్ని ఆదేశాల రూపంలో చేసింది. ఢిల్లీ ఎయిమ్స్‌లోని జెరియాట్రిక్స్ (geriatrics) డిపార్ట్ మెంట్ ఇచ్చిన స‌జీష‌న్స్ ఇందులో ఎక్కువగా ఉన్నాయి.

కోవిడ్ భారి నుంచి వృద్ధుల రక్షణకు కేంద్రం తాజా ఆదేశాలు :

  • 60 ఏళ్లు దాటిన వారిపై అన్ని రాష్ట్రాలూ ప్ర‌త్యేక శ్ర‌ద్ద చూపాలి.
  • పెద్దవాళ్లకు.. గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, డయాబెటిస్, ఆస్తమా, క్రోనిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మొనరీ డిసీజ్హైపర్‌టెన్షన్ ఉంటే వారిపట్ల మరింత ఎక్కువ జాగ్రత్త చూపాలి.
  • బ‌య‌ట ప‌నులున్నా సీనియ‌ర్ సిటిజ‌న్స్ వాయిదా వేసుకోవాలి. ఎమ‌ర్జెన్సీ అయితే ఆ బాధ్య‌త‌ను ప్ర‌భుత్వ అధికారులు నిర్వ‌ర్తించాలి
  • వ‌య‌సు పైబ‌డిన‌వారు ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల వల్ల అతిథుల‌ను ఇంటికి పిలువ‌కూడ‌దు. హ‌త్తుకోడాలు, షేక్ హ్యాండ్స్ వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి
  • ఎక్కువ‌గా మంచి నీళ్లు సేవించాలి..ఒంట్లో ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే..హెల్ప్‌లైన్ నంబర్ 08046110007కి కాల్ చేసి సాయం పొందొచ్చు.
  • వృద్దులు ఉప‌యోగించే వీల్ చైర్లు, చేతి కర్రలు, దుప్పట్లు, బొంతలు, ఇలాంటివన్నీ ఇంట్లో ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఎప్పటికప్పుడు శుభ్రం చెయ్యాలి
  • శానిటైజర్ లేదా చేతులు సబ్బుతో కడుక్కోకుండా ఏ వ‌స్తువుల‌ను ముట్టుకోకూడ‌దు. ఈ విష‌యాన్ని కుటుంబ స‌భ్యులు వారికి అర్ధమయ్యేలా చెప్పాలి
  • ఒంటరిగా జీవించే వృద్ధుల చుట్టుపక్కల వాళ్లపై ఆధార‌ప‌డాలి. వారికి నిత్యవసరాలు, అత్యవసరాల స‌మ‌కూర్చే విష‌యంలో ఇరుగుపొరుగువారు కూడా స‌హాయం చెయ్యాలి