కరోనా ఎఫెక్ట్: చైనా తరువాత ఇరాన్.. 107మంది మృతులు..!

చైనాలో ప్రాణం పోసుకొని 73దేశాలను గడగడలాడిస్తోంది కరోనావైరస్. చైనాతో పాటు ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాలో మరణమృదంగం మోగిస్తోంది. కోవిడ్-19 కారణంగా ఇరాన్‌లో మృతి చెందిన వారి సంఖ్య 107కు పెరిగింది.

కరోనా ఎఫెక్ట్: చైనా తరువాత ఇరాన్.. 107మంది మృతులు..!
Follow us

| Edited By:

Updated on: Mar 05, 2020 | 7:49 PM

చైనాలో ప్రాణం పోసుకొని 73దేశాలను గడగడలాడిస్తోంది కరోనావైరస్. చైనాతో పాటు ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాలో మరణమృదంగం మోగిస్తోంది. కోవిడ్-19 కారణంగా ఇరాన్‌లో మృతి చెందిన వారి సంఖ్య 107కు పెరిగింది. అలాగే, కరోనా వైరస్ నిర్ధారిత కేసుల సంఖ్య 3,513కు చేరుకుంది. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పెద్ద నగరాల మధ్య రాకపోకల నియంత్రణ కోసం చెక్ పాయింట్లు ఏర్పాటు చేసింది. అలాగే, కరెన్సీ వాడకాన్ని తగ్గించాలని ప్రజలను కోరింది.

ఈ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ మరింత విస్తరించకుండా ఉండేందుకు బెత్లహామ్‌లోని నేటివిటీ చర్చిని నిరవధికంగా మూసివేస్తున్నట్టు పాలస్తీనా అధికారులు ప్రకటించిన వెంటనే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇరాన్ ఆరోగ్యశాఖ మంత్రి సయీద్ నమామి మాట్లాడుతూ.. పర్షియన్ల కొత్త సంవత్సరమైన మార్చి 20న స్కూళ్లు, యూనివర్సిటీలు మూసివేయనున్నట్టు తెలిపారు. ఇంధనం కోసం పెట్రోలు బంకులకు వచ్చే వాహనదారులు అందులోనే ఉండాలని, కిందికి దిగొద్దని సూచించారు.

కరోనావైరస్ మరణాలు చైనా తర్వాత ఇరాన్, ఇటలీలోనే ఎక్కువగా ఉన్నాయి. అలాగే, పర్యాటకులను వెస్ట్‌బ్యాంక్‌లోకి అనుమతించడం లేదని పేర్కొన్నారు. అయితే, ఇది ఎంత కాలం కొనసాగుతుందనే విషయాన్ని వెల్లడించలేదు. వెస్ట్‌బ్యాంక్‌ను సందర్శించే పర్యాటకులు బెత్లెహామ్, జెరిఖోలను సందర్శిస్తుంటారు.