Breaking News
  • నేడు సీఎం జగన్‌ ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు. కర్నూలులో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌.
  • నేటి నుంచి భారత్‌, బంగ్లాదేశ్‌ చరిత్రాత్మక డేఅండ్‌ నైట్‌ టెస్టు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మ్యాచ్‌ ప్రారంభం.
  • హైదరాబాద్‌: ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో ఔషధాల కొరత. ఐఎంఎస్‌లో ఫిబ్రవరి నుంచి నిలిచిపోయిన కొనుగోళ్లు. ఐఎంఎస్‌ కుంభకోణం నేపథ్యంలో.. ఔషధాల కొనుగోళ్లకు ముందుకురాని అధికారులు. ఔషధాల కొనుగోలు బాధ్యతను.. క్షేత్రస్థాయి అధికారులకు అప్పగించాలనే యోచనలో ఐఎంఎస్‌.
  • హైదరాబాద్‌లో అమిటీ యూనివర్సిటీ. విద్యాశాఖకు దరఖాస్తు చేసిన అమిటీ గ్రూపు. ఇప్పటికే దేశంలోని 10 నగరాల్లో ఉన్న అమిటీ యూనివర్సిటీలు.
  • రజినీకాంత్‌ వ్యాఖ్యలకు పళనిస్వామి కౌంటర్‌. రాజకీయ పార్టీని ఏర్పాటు చేయకుండా.. రాజకీయాల్లో అద్భుతాలపై మాట్లాడడం సరికాదు. దేని ఆధారంగా 2021 ఎన్నికల్లో అద్భుతం జరుగుతుందని.. రజినీకాంత్‌ విశ్వసిస్తున్నారో అర్థం కావడంలేదు-పళనిస్వామి.
  • గంగానది ప్రక్షాళన ప్రక్రియ కొనసాగుతోంది. ప్రక్షాళన కోసం రూ.28,600 కోట్ల వ్యయంతో.. 305 ప్రాజెక్టులను మంజూరు చేశాం. దాదాపు 109 ప్రాజెక్టులను పూర్తయ్యాయి. ప్రస్తుతం గంగా నదిలో నీటి నాణ్యత పెరిగింది -కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌.
  • 2020లో సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. 23 సాధారణ సెలవులు, 17 ఐచ్ఛిక సెలవులు ఇవ్వాలని నిర్ణయం.
  • గుంటూరు: 104 సిబ్బంది మధ్య ఘర్షణ. రాడ్‌తో ఫార్మసిస్ట్‌పై దాడి చేసిన డ్రైవర్‌. ఫార్మసిస్ట్‌ పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు. రాజుపాలెం మండలం కోట నెమలిపురి దగ్గర ఘటన.

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..ఏమన్నారంటే?

CM KCR Press Meet After Huzurnagar Election Results, ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..ఏమన్నారంటే?

హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ ఘనవిజయం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన  ముందుగా ఇంతటి గెలుపును అందించిన నియోజకవర్గ ఓటర్లకు కృతఙ్ఞతలు తెలిపారు. ప్రతికూల వాతావరణంతో తన సభ జరగకపోయినా ప్రజలు ఆశీర్వదించారని చెప్పారు. ఈ విజయం ప్రభుత్వానికి టానిక్‌లా పనిచేస్తుందన్నారు. త్వరలోనే హుజూర్‌నగర్‌ వెళ్లి కృతజ్ఞత సభ ద్వారా ప్రజలకు ధన్యవాదాలు చెబుతానన్నారు. ఉప ఎన్నిక ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సీఎం చెప్పారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో సమ్మెతో ఆర్టీసీ కార్మికులు దురహంకార పద్ధతిని అవలంబించారని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. కార్మికుల వేతనాలు నాలుగేళ్లలోపు 67 శాతం పెంచామని.. దేశంలో ఎక్కడైనా ఇలా పెంచిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. కార్మికులు ఇంకా గొంతెమ్మ కోర్కెలు కోరడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది అసంబద్ధమైన, అర్థరహితమైన, తెలివి తక్కువ నినాదం. కార్మికులు చేస్తున్న సమ్మెలో ఔచిత్యం లేదు. ఆర్టీసీ సమ్మె కాదు.. ఆర్టీసీయే ముగుస్తుంది” అని కేసీఆర్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు.

  ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ ‌చేసిన మరిన్ని వ్యాఖ్యలు దిగువ వీడియోలో..