చిరు టెస్ట్‌ లుక్ ఓకే.. షూటింగ్ ఎప్పుడంటే..!

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్లో సినిమా రాబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌లోనే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌లో జనవరి మొదటి వారం నుంచి జరగనుంది. దీనికి సంబంధించిన గురువారం చిరుపై లుక్‌ టెస్ట్ ముగిసింది. చిరు లుక్‌ను ఫైనల్ చేసేశాడు దర్శకుడు కొరటాల. ఈ క్రమంలో షూటింగ్‌కు ఏర్పాట్లను ప్రారంభించేశాడు దర్శకుడు. అయితే ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకు […]

చిరు టెస్ట్‌ లుక్ ఓకే.. షూటింగ్ ఎప్పుడంటే..!
Follow us

| Edited By:

Updated on: Dec 27, 2019 | 2:27 PM

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్లో సినిమా రాబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌లోనే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌లో జనవరి మొదటి వారం నుంచి జరగనుంది. దీనికి సంబంధించిన గురువారం చిరుపై లుక్‌ టెస్ట్ ముగిసింది. చిరు లుక్‌ను ఫైనల్ చేసేశాడు దర్శకుడు కొరటాల. ఈ క్రమంలో షూటింగ్‌కు ఏర్పాట్లను ప్రారంభించేశాడు దర్శకుడు.

అయితే ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్లాల్సింది. కానీ లుక్ కోసం చాలా కసరత్తులే చేశాడు చిరు. ముఖ్యంగా ఆయన వయస్సును దృష్టిలో పెట్టుకున్న ఫిట్‌నెస్ ట్రైనర్.. నిదానంగానే చిరు బరువును తగ్గించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే పలుమార్లు షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక తాజాగా చిరు లుక్‌కు గ్రీన్ సిగ్నల్ రావడంతో.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇదిలా ఉంటే తన ముందు చిత్రాలలాగే సామాజిక కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు కొరటాల. ఇందులో చిరు ఇంతవరకు నటించిన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ మూవీ కోసం చిరు సరసన త్రిష ఫైనల్ అయ్యింది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించబోతున్నాడు. కాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా ఓ చిన్న పాత్రలో మెరవబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? చిరు నెక్ట్స్ మూవీ టైటిల్ ఏంటి..? ఎప్పుడు విడుదల కాబోతోంది..? తదితర విషయాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు