చైనాలో మళ్లీ కరోనా టెన్షన్.. కొత్తగా నమోదవుతున్న కేసులు..

కరోనా మహమ్మారి పురుడుపోసుకున్న చైనాలో.. మళ్లీ టెన్షన్ మొదలైంది. వైరస్ పుట్టింది ఇక్కడే అయినా.. గత కొన్ని రోజులుగా ఇక్కడ వైరస్ ఆనవాళ్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో అక్కడ మళ్లీ అంతా నార్మల్ స్టేజ్‌కు వచ్చిందనుకున్నారు. అయితే తాజాగా అక్కడ కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా బుధవారం నాడు మరో 15 కేసులు నమోదయ్యాయి. అయితే అందులో 12 మందికి ఎలాంటి వైరస్‌ లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. మరోవైపు వుహాన్‌ నగరంలో రెండోసారి […]

చైనాలో మళ్లీ కరోనా టెన్షన్.. కొత్తగా నమోదవుతున్న కేసులు..
Follow us

| Edited By:

Updated on: May 14, 2020 | 5:12 PM

కరోనా మహమ్మారి పురుడుపోసుకున్న చైనాలో.. మళ్లీ టెన్షన్ మొదలైంది. వైరస్ పుట్టింది ఇక్కడే అయినా.. గత కొన్ని రోజులుగా ఇక్కడ వైరస్ ఆనవాళ్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో అక్కడ మళ్లీ అంతా నార్మల్ స్టేజ్‌కు వచ్చిందనుకున్నారు. అయితే తాజాగా అక్కడ కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా బుధవారం నాడు మరో 15 కేసులు నమోదయ్యాయి. అయితే అందులో 12 మందికి ఎలాంటి వైరస్‌ లక్షణాలు లేవని అధికారులు తెలిపారు.

మరోవైపు వుహాన్‌ నగరంలో రెండోసారి వైరస్‌ విజృంభించే అవకాశం ఉన్నందున వార్తలు హల్ చల్ చేస్తుండటంతో.. స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ క్రమంలో 1.10 కోట్ల మందికి కరోనా టెస్టులు జరపాలని అధికారులు నిర్ణయించారు. కాగా.. బుధవారం నాటికి చైనాలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 82,929కు చేరింది. వీరిలో 4633 మంది ప్రాణాలు కోల్పోయారని నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ ప్రకటించింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 45 లక్షలకు చేరువలో ఉన్నాయి. వీరిలో దాదాపు 2.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 16.4 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు.